వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూ దేవతలపై వ్యాఖ్యల వివాదం- స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌కు సుప్రీం బెయిల్

|
Google Oneindia TeluguNews

హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండప్‌ కమెడియన్ మునావర్‌ ఫారూకీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఫారూకీపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ అస్పష్టంగా ఉందని తేల్చిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇండోర్‌లోని ఒక కేఫ్‌లో జరిగిన కామెడీ షో సందర్భంగా హిందూ దేవతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని బిజెపి ఎమ్మెల్యే కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు మునావర్ ఫారుకి, మరో నలుగురిని జనవరి 2 న అరెస్టు చేశారు. అనంతరం మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో యూపీలో నమోదైన కేసులో హాస్యనటుడు మునవర్ ఫారుకిపై జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Comedian Munawar Faruqui granted bail, Supreme Court says FIR vague

మునావర్‌ ఫారూకీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత మునవర్ ఫరూకి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులకు నోటీసు కూడా జారీ చేశారు. మునవర్ ఫారుకి గురువారం ఆలస్యంగా బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కేసు విచారించిన సుప్రీంకోర్టు మునావర్‌కు వ్యతిరేకంగా పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ "అస్పష్టంగా" ఉందని, అరెస్టుకు ముందు నోటీసు ప్రోసీజర్‌నుఅనుసరించలేదని పేర్కొంది. మునావర్ ఫరూకి జనవరి 2 నుంచి జైలులో ఉన్నారు. హాస్యనటుడు మునవర్ ఫరూకికి మధ్యప్రదేశ్ హైకోర్టు గత వారం బెయిల్ నిరాకరించింది మరియు "సామరస్యాన్ని పెంపొందించడం" రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాలలో ఒకటి అని పేర్కొంది.

English summary
The Supreme Court on Friday granted bail to stand-up comedian Munawar Faruqui, saying that the procedure of the notice before his arrest was not followed. The Supreme Court also said that the FIR was vague.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X