వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ సీఎం సిద్దరామయ్య ప్రశ్నకు హీరో కమల్ హాసన్ సమాధానం, పట్టు పంచె, కావేరి (వైరల్)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బుధవారం అధికారం స్వీకరించింది. బుధవారం కుమారస్వామి, పరమేశ్వర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ హాజరు అయ్యారు.

కమల్ హాసన్ చర్చలు

కమల్ హాసన్ చర్చలు

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన హీరో, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించారు. ఇదే సందర్బంలో కర్ణాటక మాజీ ముఖ్యంత్రి సిద్దరామయ్యతో కమల్ హాసన్ ముచ్చటించారు.

పంచెకట్టులో కమల్ హాసన్

పంచెకట్టులో కమల్ హాసన్

కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రానికి కమల్ హాసన్ పట్టు పంచె కట్టుకుని పట్టు షర్టు వేసుకుని హిందూ సాంప్రధాయ పద్దతిలో హాజరైనారు. కమల్ హాసన్ భుజం మీద చెయ్యి వేసిన మాజీ సీఎం సిద్దరామయ్య ఆయన యోగక్షేమాల గురించి అప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.

కావేరీ నీటి సమస్య

కావేరీ నీటి సమస్య

కావేరీ నీరు పంపిణి విషయంలో కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలు స్నేహం కాపాడుకోవాలని కమల్ హాసన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించని కమల్ హాసన్ సహజ వనరులు అందరూ సమానంగా పంచుకోవాలని, ఈ విషయంలో రాజకీయాలు చెయ్యడం మంచిది కాదని కమల్ హాసన్ అంటున్నారు.

కమల్, సిద్దూ ఫోటోకు కామిడీ ట్వీట్

కమల్ హాసన్, సిద్దరామయ్య మాట్లాడుకుంటున్న ఫోటోకు ఓ వ్యక్తి కామిడీ ట్వీట్ చేశారు. సిద్దరామయ్య కన్నడలో కమల్ హాసన్ తో మాట్లాడుతున్నారని, కమల్ హాసన్ అచ్చమైన తమిళ బాషలో సమాధానం ఇస్తున్నారని, వారి సంభాషణ ఇలా ఉందని ఓ వ్యక్తి కామిడీ ట్వీట్ చేశారు.

కమల్, సిద్దూ చర్చలు

కమల్, సిద్దూ చర్చలు

సిద్దరామయ్య కమల్ హాసన్ భుజం మీద చెయ్యి వేసి ఎందుకు పంచెకట్టుకుని అంతదూరం నుంచి వచ్చారు అంటూ కన్నడలో ప్రశ్నించారు. ఆ సమయంలో కమల్ హాసన్ అచ్చం తమిళ బాషలో సిద్దరామయ్య గారు మా ఇంటిలో బట్టలు శుభ్రం చెయ్యడానికి నీరు లేదు, ఇలాంటి పరిస్థితిలో మేము ఉన్నాం, మీరు శ్రీకుమార్ (కుమారస్వామి)కి చెప్పి కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చేయించండి అంటూ సమాధానం ఇచ్చారని కామిడీ ట్వీట్ చేశారు. కమల్ హాసన్, సిద్దరామయ్య ఉన్న ఫోటోతో పాటు ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

English summary
Comedy Tweet and reaction : When Kamal Hassan meets Siddaramaiah, What did Kamal say to Siddaramaiah. In a lighter mood did he ask about Cauvery river sharing? check out the funny tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X