వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలికాపీ విడుదలైంది,చూసేందుకు ఆమె లేకుండా పోయింది

ఆమె జీవిత చరిత్రను రేఖ చిత్రాల ఆధారంగా తయారు చేసిన కామిక్ పుస్తకం తొలికాపీ సిద్దమైంది.కాని, ఆ పుస్తకం విడుదలైన రోజునే జయలలిత చనిపోయారు. టూనీ యానిమేటర్స్ సంస్థ ఈ పుస్తకాన్ని తయారు చేసింది. జయ చేతుల మ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :అమ్మ జీవిత చరిత్రను కామిక్ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆమె చేతుల మీదుగానే ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయాలని అనుకొన్నారు. తొలి కాపీ విడుదలైన రోజే ఆమె చనిపోయింది. ఆమె చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని భావించిన నిర్వహకులకు నిరాశే మిగిలింది.

హైద్రాబాద్ కు చెందిన టూనీ ఆర్ట్స్ యానిమేషన్ చిత్రాలను చేస్తోంది. దాదాపుగా పదేళ్ళకు పైగా ఈ సంస్థ ఈ రకమైన చిత్రాలను తయారు చేస్తోంది. తొలుత చిన్నపిల్లలను ఆకర్షించే రీతిలో ఆ సంస్థ పనిచేసింది. రాను రాను తన పంథాను మార్చుకొంది.

comic book about jayalalita first copy release

కెసిఆర్ పై తొలి కామిక్ పుస్తకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మీద టూనీ ఆర్ట్స్ యానిమేషన్ సంస్థ తొలి కామిక్ పుస్తకాన్ని తయారు చేసింది. కెసిఆర్ జీవిత చరిత్రను ఇందులో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కెసిఆర్ చూసి ఆనంద పడ్డారు. ఈ పుస్తకాన్ని కెసిఆర్ స్వయంగా ఆవిష్కరించారు.ఈ తరహా ప్రయోగం సక్సెస్ కావడంతో జయలలితపై కామిక్ పుస్తకాన్ని తయారు చేయాలని భావించారు.

ఈ ఆలోచన వచ్చిందే ఆలస్యం జయ జీవిత చరిత్రను రేఖా చిత్రాల ద్వారా యానిమేటర్లు పుస్తకం తయారు చేశారు. సినిమాల నుండి రాజకీయాల్లోకి రావడం, బాల్యం నుండి సినిమాల్లోకి ఏ రకంగా ఆమె ప్రవేశించారనే అంశాలపై ఆమె జీవితన చరిత్రను సిద్దం చేశారు. ఈ పుస్తకం తయారైంది. జయ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నారు.

అయితే ఈ పుస్తకం తుదిదశలో ఉన్న సమయంలో జయ జీవిత చరిత్ర ఆధారంగా పుస్తకాన్ని తయారు చేస్తోన్న విషయాన్ని ఆమెకు చేరవేయాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆమె ఆసుపత్రిలో చేరారు. ఈ పరిస్థితిని తెలుసుకొని నిర్వాహకులు బాదపడ్డారు. పుస్తకంలో మార్పులు చేర్పులు చేసుకొని తొలి కాపీని సిద్దం చేసుకొన్నారు. అయితే అదే రోజు ఆమె చనిపోయింది. ఆమె జీవిత చరిత్రను రేఖ చిత్రాలపై చూసుకొని ఎంతగానో సంతోషపడేవారని నిర్వాహాకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
comic book about jayalalita life history.toony animator organation published comic book about jayalalita. first book release on dec 5th, that night jaya died in hospital.how to she enter in politics, cinema in that book with art.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X