వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయ్ పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు ఈసీకి వివరణ ఇచ్చిన నీతి ఆయోగ్ వీసీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కనీస ఆదాయ పథకంపై విమర్శలు చేసి నోటీసులు అందుకున్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈసీకి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని స్పష్టంచేశారు. ఒక ఆర్థికవేత్తగా చేసిన కామెంట్లే తప్ప వాటితో నీతి ఆయోగ్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈసీకి ఇచ్చిన వివరణలో రాజీవ్.. 2014లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అప్పటి ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చేసిన వ్యాఖ్యల్ని ఉదహరించారు. గుజరాత్ మోడల్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.

Comments on NYAY proposal my personal opinion: Niti aayog vc

<strong>కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీ</strong>కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంతో దేశ ఆర్థికవ్యవస్థ నాశనమవుతుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్న కాంగ్రెస్.. న్యాయ్ పథకం ద్వారా నెలకు ఆరు వేలు ఇస్తామని హామీ ఇస్తోందని విమర్శించారు. న్యాయ్ పథకాన్ని అమలుచేస్తే ఆర్థికలోటు 3.5 నుంచి 6శాతానికి చేరుతుందన్న రాజీవ్.. అదే జరిగితే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు భారత రేటింగ్‌ను తగ్గిస్తాయని అన్నారు. నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ అయిన రాజీవ్.. ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

English summary
Responding to letter seeking an explanation for his criticism of the proposed NYAY, NITI Aayog VC Rajiv Kumar told the Election Commission on Tuesday that he spoke in his personal capacity as an economist and his comments should not be interpreted as Aayog’s stand on the Congress announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X