వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేటీకరణకే మొగ్గు.. ఆ నాలుగు తప్ప, ప్రధాని మోడీ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోంది. అందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఏపీలో పెను దుమారం రేగుతోంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. వారసత్వంగా వస్తున్నాయనే భావనతో వాటిని నడపలేమని చెప్పారు. పరిపుష్టం చేసేందుకు ఆర్థికసాయం చేయడం పెనుభారంతో కూడుకున్నదని అన్నారు.

అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, అవి ప్రజల ధనంతో నడుస్తున్నాయని మోడీ చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ మోడీ ఈ కామెంట్స్ చేశారు.

committed for privatization of psus: modi

ప్రభుత్వం వైదొలగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందని మోడీ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరని అన్నారు. వ్యాపార రంగానికి కేంద్ర ప్రభుత్వం తమవంతు తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను ఏర్పాటు చేసినప్పటి పరిస్థితులు వేరని... ఇప్పుడున్న పరిస్థితులు వేరని చెప్పారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలనే లక్ష్యంతో సంస్కరణలను తీసుకొస్తున్నామని అన్నారు.

English summary
committed for privatization of psus prime minister narendra modi said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X