వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, కీలక చర్చ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక చర్చలు జరిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పరస్పరం మరింత సహకారం అందించుకునేందుకు అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.

అంతర్జాతీయ నిబంధనలకు తాను, బైడెన్ కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, అతవల కూడా శాంతియుత, భద్రత కలిగిన వాతావరణాన్ని కల్పించేందుకు తాము కృషి చేస్తామని, తమ భాగస్వామ్యం మరింత పఠిష్టం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

 Committed To Rules-Based Order: PM Narendra Modi Speaks To Joe Biden

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోడీ ఆయన ఫోన్లో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, జనవరిలో 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ప్రధాని మోడీ పలు ట్వీట్ల ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేశారు.

నూతన నాయకత్వంలోని అమెరికాతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ప్రపంచ శాంతి, భద్రతల కోసం సహకారం అందిస్తామని చెప్పారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆకాంక్షించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతుల స్వీకరించిన కమలా హారీస్‌కు కూడా ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. ఆమె విజయం భారతీయ అమెరికన్లు గర్వపడేలా చేసిందన్నారు.

English summary
Prime Minister Narendra Modi tweeted this evening to say that he has spoken to the new US President Joe Biden to discuss regional issues and "our shared priorities".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X