వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముచ్చటగా మూడోసారి: ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం వరుసగా ఇది మూడోసారి. దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్.. కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు ఆరుమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వేలాది మంది ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదే సంఖ్యలో ఢిల్లీ ప్రజలు హాజరయ్యారు. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. బీజేపీ కాంగ్రెస్‌లు పిక్చర్‌లో లేకుండా చేసింది. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో సామాన్యుడి పార్టీ ఆప్ 62 స్థానాలు గెలువగా... బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. 2015లోలానే కాంగ్రెస్ మరోసారి ఖాతా తెరవడంలో విఫలమైంది.

ఇక అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణస్వీకారంకు వేదికగా రామ్‌లీలా మైదాన్ ముస్తాబైంది. ఢిల్లీలోని ప్రతి సామాన్యుడు ఈ ప్రమాణస్వీకారం వేడుకకు హాజరు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానం పలికారు.

Common Man all set to become third time CM:Live updates on Arvind Kejriwal swearing in ceremony

ప్రమాణస్వీకారం సజావుగా సాగేందుకు ఢిల్లీ పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చేపట్టింది. దాదాపు 3వేల మంది పోలీసులను పారామిలటరీ దళాలను దేశ రాజధానిలో మోహరించింది. కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం మినిట్ టూ మినిట్ లైవ్ అప్ డేట్స్..

Newest First Oldest First
12:57 PM, 16 Feb

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులను ఆశిస్తున్నాను. కొత్త ప్రభుత్వాన్ని ఆయన ఆశీర్వదించాలి. కేంద్రం అండదండలతో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాం: కేజ్రీవాల్
12:55 PM, 16 Feb

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

ప్రమాణ స్వీకారం వేదికపై హమ్ హోంగే కామ్‌యాబ్.. అనే గీతాన్ని ఆలపించిన అరవింద్ కేజ్రీవాల్
12:47 PM, 16 Feb

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

రాజకీయాలకు అతీతంగా, కుల, మత రహితంగా పరిపాలనను అందిస్తా. ఒక్క ఆమ్ఆద్మీపార్టీకి మాత్రమే నేను ముఖ్యమంత్రిని కాదు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దుతుదారులకు కూడా ముఖ్యమంత్రినే. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేస్తా: కేజ్రీవాల్
12:41 PM, 16 Feb

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక పరిపాలనపై దృష్టి పెడతాం. మీరు ఎవరికైనా ఓటు వేసి ఉండొచ్చు. ప్రతి ఓటరు కూడా ఆమ్ఆద్మీ కుటుంబ సభ్యుడే: కేజ్రీవాల్
12:39 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఇది నా గెలుపు కాదు. ప్రతి ఢిల్లీ పౌరుడు సాధించిన ఘన విజయం. తన అయిదేళ్ల పరిపాలనపై ఢిల్లీ ఓటర్లు ఇచ్చిన తీర్పు: అరవింద్ కేజ్రీవాల్
12:35 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణ స్వీకారం. ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఆరుమంది సభ్యులు
12:34 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బేబీ మఫ్లర్‌మ్యాన్. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వస్త్రధారణలో ఆకట్టుకున్న లిటిల్ మఫ్లర్‌మ్యాన్
12:30 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజేంద్ర పాల్ గౌతమ్. మొన్నటి ఎన్నికల్లో ఆయన సీమాపురీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
12:28 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇమ్రాన్ హుస్సేన్. మొన్నటి ఎన్నికల్లో ఆయన బలిమారన్ స్థానం నుంచి విజయం సాధించారు.
12:27 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కైలాష్ గెహ్లాట్. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో నజఫ్‌గఢ్ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు.
12:26 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గోపాల్ రాయ్. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో బాబర్‌పూర్ స్థానం నుంచి విజయం సాధించారు.
12:25 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సత్యేంద్ర జైన్. ఢిల్లీ ఎన్నికల్లో షాకూర్ బస్తీ నుంచి ఆయన విజయం సాధించారు.
12:22 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మనీష్ సిసోడియా. మొన్నటి ఎన్నికల్లో ఆయన పట్‌పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
12:20 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్. వరుసగా మూడోసారి ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
12:17 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న అరవింద్ కేజ్రీవాల్. ఆయనతో ప్రమాణం చేయిస్తోన్న లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్.
12:13 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

ఇక టార్గెట్ పంజాబ్: ఈ సారి పంజాబ్‌లో పాగా వేస్తామంటోన్న ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిషి
12:12 PM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

నాయక్-2 ఈజ్ బ్యాక్ అగైన్ అంటూ రామ్‌లీలా మైదాన్‌లో ఆకట్టుకుంటున్న బ్యానర్
11:59 AM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణం

రామ్‌లీలా మైదానానికి చేరుకున్న ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్. మరి కొన్ని క్షణాల్లో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం ఆరంభం.
11:57 AM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకార వేదికపై ఆసీనులైన అరవింద్ కేజ్రీవాల్, సహచరులు
11:56 AM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

భధ్రత గుప్పిట్లో రామ్‌లీలా మైదానం. 3000 మంది ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్, పారామిలటరీ బలగాలు మోహరింపు
11:53 AM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి రామ్‌లీలా మైదానానికి చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్. భార్య సునీత కేజ్రీవాల్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్
11:51 AM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా తరలివస్తోన్న ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. రామ్‌లీలా మైదానంలో కోలాహలం
9:26 AM, 16 Feb

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్
8:50 AM, 16 Feb

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సమయం మరి కాస్త ముందుకు. ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు ప్రమాణం చేయనున్న ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్
7:16 AM, 16 Feb

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆకర్షణగా బేబీ మఫ్లర్‌మ్యాన్
7:07 AM, 16 Feb

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి భారీ బందోబస్తు. రామ్‌లీలా మైదానాన్ని డ్రోన్లతో పర్యవేక్షిస్తోన్న పోలీసులు
7:42 PM, 15 Feb

న్యూఢిల్లీ

ఢిల్లీలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
7:42 PM, 15 Feb

న్యూఢిల్లీ

తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించిన అరవింద్ కేజ్రీవాల్
7:41 PM, 15 Feb

న్యూఢిల్లీ

కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్
7:40 PM, 15 Feb

న్యూఢిల్లీ

కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన రాంలీల మైదాన్
READ MORE

English summary
Aam Aadmi Party (AAP) national convener Arvind Kejriwal is all set to take oath for the third time as chief minister of Delhi on Sunday. The AAP scored a landslide victory in the Delhi assembly elections 2020 as it swept aside both BJP and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X