వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపూర్‌లో మత ఘర్షణలు.. 25మందికి గాయాలు..., మొబైల్ ,ఇంటర్‌నెట్ సేవలు రద్దు .

|
Google Oneindia TeluguNews

జైపూర్‌లో రెండు వర్గాల మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. కాగా ఈ రాళ్ల దాడిలో పదిమంది పోలీసులతో పాటు 25 మంది వరకు గాయాలు అయినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అల్లర్లు తారాస్థాయికి చేరడంతో పోలీసులు కమ్యూనికేషన్ వ్యవస్థకు బ్రేకులు వేశారు . ఈ నేపథ్యంలోనే ఇంటర్‌నేట్‌తో పాటు పలురకాల సాంకేతిక సర్వీసులను రద్దు చేశారు.

communal clashes in Jaipur,Mobile internet services suspended

జైపూర్‌లో సోమవారం సాయంత్రం ప్రారంభమైన రెండు వర్గాల మధ్య అల్లర్లు తీవ్రం కావడంతో నేడు రాళ్ల దాడి చేసుకున్నారు. ధర్నాలు, రాస్తారోకోలోని రెండు చోట్ల అల్లర్లు చెలరేగాయి. ఈనేపథ్యంలోనే ఇరు వర్గాలు రాళ్ల దాడులు కొనసాగాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలను నిలిపి వేశారు. కాగా సోమవారం సాయంత్రం గాట్ల ప్రాంతంలోని ఓవర్గం హరిద్వార్ వెళుతున్న బస్‌పై రాళ్లు రువ్వారు. దీంతో అల్లర్లకు బీజం పడినట్టు తెలుస్తోంది.

జైపూర్‌లోని గాట్లా గేట్ ప్రాంతంలో శివభక్తులపై ఓ వర్గం దాడి చేయడంతో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. దీంతో రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు కొనసాగాయి. ఈనేనపథ్యంలోనే మైనారీటీ కమ్యూనిటికి చెందిన వర్గం డిల్లీ హైవైలో ఉన్న ఈద్గా వద్ద ధర్న కొనసాగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు కొనసాగాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అల్లర్లు ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఇరు వర్గాల రాళ్ల దాడిలో పోలీసులతో పాటు 25 మంది వరకు గాయాలు అయ్యాయి. దీంతో సంఘటనకు బాద్యులుగా అనుమానిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

English summary
Mobile internet services suspended in Jaipur after communal clash,Twenty-four people including nine policemen, were injured when members of two communities pelted stones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X