బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Kangana:కంగనాకు కొవ్వు పట్టింది. దించేస్తాం, రైతులు ఉగ్రవాదులా ? కడుపుకు అన్నం తింటున్నావా ? లేదా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబాయి/ తుమకూరు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, Bollywood Drug Mafia కేసుల తరువాత ఒక్కసారిగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ కు అనేక కష్టాలు ఎదురౌతున్నాయి. ఇప్పుడు అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ ఉద్దరగా పబ్లిసిటీ సంపాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై కేసు నమోదు అయ్యింది. రైతులు నీకు ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారా ? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా ? లేక చిత్రాన్నం తింటున్నావా ?, నీకు కొవ్వు బాగా పట్టింది, ఆ కొవ్వు దించేస్తాం జాగ్రత్త ! అంటూ ప్రజలు మండిపడుతున్నారు. కంగనా కాస్కో అంటూ బాలీవుడ్ హీరోయిన్ పై న్యాయవాది రమేష్ నాయక్ కర్ణాటకలో కేసు పెట్టి క్వీన్ కు సినిమా చూపించడానికి సిద్దం అయ్యారు.

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

కేంద్రంపై అన్నదాతలు ఫైర్

కేంద్రంపై అన్నదాతలు ఫైర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుంటున్నారు. తమకు నష్టం కలిగించే ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయింది. దేశవ్యాప్తంగా అన్నదాతలకు అనేక పార్టీలు, పలు సంఘ సంస్థలు, ప్రజలు మద్దతు తెలిపారు.

 ఖాళీగా కుర్చున్న కంగనా

ఖాళీగా కుర్చున్న కంగనా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్స్ మాఫీయా కేసుల తరువాత ఒక్కసారిగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ ఏదోఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు, శివసేన నాయకులు, సోనియా గాంధీ ఇలా అనేక మంది నాయకులపై విరుచుకుపడుతున్న కంగనా రనౌత్ ప్రస్తుతం ఖాళీగా కుర్చుందని ఆరోపణలు ఉన్నాయి.

 రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా

రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో అన్నదాతలు రోడ్లు ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నలు ఆందోళనలు చేస్తున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ ట్విట్ చెయ్యడం కలకలం రేపింది.

 కంగనా కాస్కో..... కమ్ కమ్

కంగనా కాస్కో..... కమ్ కమ్

అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ నటి కంగనా రనౌత్ ట్విట్ చేసి రైతన్నలను అవమానించారని, ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయవాది, తుమకూరు నివాసి ఎల్. రమేష్ నాయక్ సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటక డీజీపీ, తుమకూరు జిల్లా ఎస్పీకి ఇ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా ఇంత వరకు నటి కంగనా రనౌత్ పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది రమేష్ నాయక్ ఆరోపిస్తున్నారు.

 కంగనాపై కోర్టులో ఫిర్యాదు

కంగనాపై కోర్టులో ఫిర్యాదు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రైతన్నలను ఉగ్రవాదులతో పోల్చుతూ అవమానించారని, ఆమె మీద పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పోలీసు అధికారుల నుంచి ఎలాంటి స్పందనలేదని, అందుకే తాను తుమకూరు జేఎంఎఫ్ సీ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశానని న్యాయవాది రమేష్ నాయక్ మీడియాకు చెప్పారు. నటి కంగనా రనౌత్ మీద కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చెయ్యాలని, లేదంటే మీరే జోక్యం చేసుకోవాలని తాను కోర్టుకు మనవి చేశానని న్యాయవాది ఎల్. రమేష్ నాయక్ మీడియాకు చెప్పారు.

Recommended Video

Top News Of The Day : China పై Donald Trump ఆగ్రహం.. చర్యలకు డిమాండ్! || Oneindia Telugu
 కంగనాకు ఒళ్లంతా కొవ్వు పట్టింది !

కంగనాకు ఒళ్లంతా కొవ్వు పట్టింది !

అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా రనౌత్ నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా ? చిత్రాన్నం తింటున్నావా ? అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కసారిగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ముంబాయి పోలీసులపై విరుచుకుపడుతున్న కంగనా రనౌత్ దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్ అయ్యారు. కంగనా నీకు కొవ్వు చాల ఎక్కువ పట్టింది, అందుకే అన్నదాలతో పెట్టుకుంటున్నావు, నీ కొవ్వు దించేస్తామ్ జాగ్రత్తగా ఉండు అంటూ రైతన్నలు మండిపడుతున్నారు.

English summary
Kangana: Complaint against Bollywood actress Kangana Ranut at Tumakuru district court in Karnataka for comparing farmers to terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X