బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. కోట్లు సీజ్, హవాల సోమ్ము, కోడ్ నెంబర్ కేజీ, త్రిబుల్ షూటర్ కు చెందిన క్యాష్, కోర్టులో ఈడీ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ మీద నమోదు చేసిన ఎఫ్ఐర్ చట్టపరంగానే ఉందని, ఎలాంటి లోపాలులేవని అడిషనల్ సాలిటర్ జనరల్ ప్రభులింగ కే. పావడగి అన్నారు. 2017 బెంగళూరు, ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న అక్రమ నగదు కర్ణాటక మంత్రి డీకే, శివకుమార్ కు చెందినదని విచారణలో వెలుగు చూసిందని ప్రభులింగ అంటున్నారు.

2017లో బెంగళూరు, ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న నగదుకు తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక మంత్రి, త్రిబుల్ షూటర్ డీకే. శివకుమార్, ఆయన ముఖ్య అనునచరులు కోర్టును ఆశ్రయించారు. వీరు సమర్పించిన అర్జీ విచారణ సోమవారం జరిగింది.

Complaint against Minister DK Shiva Kumar according to law says Additional Solicitor General Prabhu

తమ మీద ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) అధికారులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలని డీకే, శివకుమార్ తదితరులు కోర్టుకు మనవి చేశారు. అర్జీ విచారణ చేసిన న్యాయమూర్తి రామచంద్ర డి, హూద్దార ఈడీ ఇరు వర్గాల వాదనలు విన్నారు.

ఈడీ తరపున అడిషనల్ సాలిటర్ జనరల్ ప్రభులింగ వాదనలు వినిపించారు. ఢిల్లీలోని ఇంటిలో అధికారులు స్వాధీనం చేసుకున్న 8.59 కోట్ల నగదు మంత్రి డీకే. శివకుమార్ కు చెందినదని ఆరోపించారు. ఈ హవాల నగదు బెంగళూరు నుంచి ఢిల్లీ తరలించడానికి కేజీ. అనే కోడ్ నెంబర్ ఉపయోగించారని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసిందని ప్రభులింగ ఆరోపించారు.

ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదుకు సరైన పత్రాలు సమర్పించడంలో మంత్రితో పాటు వీరందకు విఫలం అయ్యారని, ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అడిషనల్ సాలిటర్ జనరల్ ప్రభులింగ ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం అర్జీ విచారణ జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.

English summary
Additional Solicitor General of India Prabhuling K.Navadgi said that enforcement directorate complaint against Karnataka water resource minister D.K.Shiva Kumar according to law. The money sized in the house at New Delhi belongs to D.K.Shiva Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X