వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చగొట్టే వ్యాఖ్యలు: సోనియా, ప్రియాంక, అసదుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

అలీగఢ్: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతోపాటు పలువురిపై కేసు నమోదైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో వారిపై ప్రదీప్ గుప్తా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

 సోనియా సందేశం ఓకే! కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి రాకపోతే..: సీఏఏపై ప్రశాంత్ కిషోర్, బ్రాండ్ మోడీపై నో సోనియా సందేశం ఓకే! కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి రాకపోతే..: సీఏఏపై ప్రశాంత్ కిషోర్, బ్రాండ్ మోడీపై నో

సోనియా, ప్రియాంక, అసదుద్దీన్‌పై కేసులు

సోనియా, ప్రియాంక, అసదుద్దీన్‌పై కేసులు

సోనియా, ప్రియాంక, అసదుద్దీన్‌తోపాటు పాత్రికేయుడు రవీష్ కుమార్‌పైనా సదురు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు దీనిపై విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. సోమవారం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహం చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా పలు నిరసనల్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

రాహుల్, ప్రియాంకలు వెనక్కి..

రాహుల్, ప్రియాంకలు వెనక్కి..

ఇది ఇలావుండగా, సీఏఏకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆందోళనల్లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మంగళవారం మీరట్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తిరిగి వారు ఢిల్లీకి వెళ్లిపోయారు.

సీఏఏకు వ్యతిరేకంగా.. ప్రియాంక..

సీఏఏకు వ్యతిరేకంగా.. ప్రియాంక..


సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన పలు నిరసన ప్రదర్శనల్లో ప్రియాంక గాంధీ స్వయంగా పాల్గొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ కూడా సీఏఏను వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ మొదట్నుంచి సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంటులోనూ ఆయన నిరసన తెలియజేశారు.

ఎవరికీ నష్టం లేదంటూ ప్రధాని, హోంమంత్రి..

ఎవరికీ నష్టం లేదంటూ ప్రధాని, హోంమంత్రి..

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో వేధింపులకు, హింసకు గురై అక్కడ బతకలేని స్థితిలో మనదేశానికి వచ్చిన ముస్లిమేతర మైనార్టీ వర్గాలకు భారత పౌరసత్వం అందించడం జరుగుతుంది. 2014కు ముందు మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇతర మైనార్టీలకు మనదేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ చట్టంతో భారతీయులైన ఏ ఒక్కరీకి కూడా నష్టం లేదని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
A complaint was filed in the chief Judicial Magistrate(CJM) court in Uttar Pradesh's Aligarh against Congress leaders Sonia Gandhi, Priyanka Gandhi Vadra and AIMIM chief Asaduddin Owaisi and others for giving provocative speeches against the amendment citizenship act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X