బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను అర్బన్ నక్సల్, ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ పై వరుస కేసులు: ప్రకాష్ రాజ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు గిరీష్ కర్నాడ్ నేను అర్బన్ నక్సల్ అంటూ సంఘ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తున్నారని, ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయవాది అమృతేశ్ బెంగళూరులోని విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ ను విచారణ చెయ్యాలని హైకోర్టు న్యాయవాది అమృతేశ్ డిమాండ్ చేస్తున్నారు.

హిందువులు, గోవుల మీద నటుడు ప్రకాష్ రాజ్ కామెంట్, కేసు నమోదు, కోర్టులో !హిందువులు, గోవుల మీద నటుడు ప్రకాష్ రాజ్ కామెంట్, కేసు నమోదు, కోర్టులో !

గిరీష్ కర్నాడ్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, వెంటనే ఆయన్ను అరెస్టు చేసి విచారణ చెయ్యాలని హైకోర్టు న్యాయవాది అమృతేశ్ పోలీసులకు మనవి చేశారు. అంతే కాకుండా గిరీష్ కర్నాడ్ మీద శ్రీరామసేన, హిందూ జనజాగృతి సమితి నాయకులు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

గౌరీ లంకేష్ వర్దంతి

గౌరీ లంకేష్ వర్దంతి

ప్రముఖ కన్నడ పత్రిక లంకేష్ ఎడిటల్ గౌరీ లంకేష్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గౌరీ లంకేష్ ప్రథమ వర్దంతి సెప్టెంబర్ 5వ తేదీ బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గిరీష్ కర్నాడ్ తో పాటు బహుబాష నటుడు ప్రకాష్ రాజ్, స్వామి అగ్నివేష్, జిగ్నేష్ మేవానీ, కన్హయ కుమార్ తదితరులు హాజరైనారు.

మీ టూ అర్బన్ నక్సల్

మీ టూ అర్బన్ నక్సల్

ఈ సందర్బంలో గిరీష్ కర్నాడ్ మీ టూ అర్బన్ నక్సల్ (నేను నగర నక్సల్) అనే ప్లకార్డు మెడలో వేసుకుని కార్యక్రమానికి హాజరైనారు. కార్యక్రమం పూర్తి అయ్యే వరకు గిరీష్ కర్నాడ్ మెడలో ఆ ప్లకార్డు అలాగే ఉంది. ప్రభుత్వం మావోయిస్టుల కార్యకలాపాలను నిషేధించిందని హైకోర్టు న్యాయవాది అమృతేశ్ గుర్తు చేశారు.

సమర్థించారు

సమర్థించారు

ప్రభుత్వం నిషేధించిన నక్సలిజాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న గిరీష్ కర్నాడ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అమృతేశ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిషేధానికి గురైన బ్యానర్లు ఎవరైనా ప్రదర్శిస్తారా ? అని హైకోర్టు న్యాయవాది అమృతేశ్ ప్రశ్నిస్తున్నారు.

నక్సల్స్ తో లింక్ ?

నక్సల్స్ తో లింక్ ?

గిరీష్ కనర్నాడ్, ఆయన అనుచరులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, భీమా కోరెగావ్ కేసులో వీరికి ప్రమేయం ఉందని, వెంటనే వారిని అరెస్టు చేసి విచారణ చెయ్యాలని హైకోర్టు న్యాయవాది అమృతేశ్ తన ఫిర్యాదులో పోలీసులకు మనవి చేశారు.

ప్రకాష్ రాజ్ విషయం !

ప్రకాష్ రాజ్ విషయం !

గిరీష్ కర్నాడ్ తో పాటు ప్రకాష్ రాజ్, స్వామి అగ్నివేష్, జిగ్నేష్ మేవానీ, కన్హయ కుమార్ తదితరులను విచారణ చెయ్యాలని హైకోర్టు న్యాయవాది అమృతేశ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై గిరీష్ కర్నాడ్ మాట్లాడుతూ చట్టం తనపని తాను చేసుకుపోతుందని, తన మీద ఫిర్యాదు చేసినందుకు ఎవరి మీద కోపం లేదని అన్నారు.

English summary
Karnataka High court lawyer Amruthesh has lodged a complaint against writer Girish Karnad for kept a placard around his neck saying me too urban naxal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X