వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనుక్కుంటారా.. లేదా?, ఇంట్రెస్ట్ లేనట్లుంది!: నజీబ్ మిస్సింగ్‌పై సీబీఐ కోర్టు

ఈ కేసుపై సీబీఐకి ఏమాత్రం ఆసక్తి లేనట్లుంది. అసలు విద్యార్థి ఆచూకీ కనుక్కుంటారా లేదా' అని కోర్టు గట్టిగానే మందలించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ గతేడాది అనుమానాస్పద పరిస్థితులలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఏడాది గడుస్తున్నా.. అతని ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మిస్సింగ్ కు ముందు నజీబ్ ఏబీవీపీ కార్యకర్తలతో గొడవ పడ్డట్లు వార్తలు రావడంతో.. మిస్సింగ్ కేసుపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

కేసును విచారిస్తున్న సీబీఐ తీరుపై ఢిల్లీ హైకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ను కనిపెట్టే విషయంలో సీబీఐ పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.

 Complete lack of interest by CBI in missing JNU student Najeeb Ahmed case: Delhi High Court

ఐదు నెలలుగా కేసును సీబీఐ విచారిస్తున్నప్పటికీ.. ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. కనీసం పేపర్ మీద కూడా ఎలాంటి ఫలితాలు లేవు. ఈ కేసుపై సీబీఐకి ఏమాత్రం ఆసక్తి లేనట్లుంది. అసలు విద్యార్థి ఆచూకీ కనుక్కుంటారా లేదా' అని కోర్టు గట్టిగానే మందలించింది.

English summary
Exactly a year after JNU student Najeeb Ahmed went missing from the campus following a scuffle with alleged ABVP members, the Delhi High Court today slammed the CBI for its "complete lack of interest" in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X