వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో కంప్లీట్ లాక్ డౌన్ .. మే 8 నుండి 16 వరకు , తప్పలేదన్న సీఎం పినరయి విజయన్

|
Google Oneindia TeluguNews

కేరళ రాష్ట్రంలోకరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అవుతున్న30 జిల్లాలలో కేరళ రాష్ట్రంలోనే పది జిల్లాలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించడం కేరళ రాష్ట్రంలో తాజా పరిస్థితికి అద్దం పడుతుంది. దీంతో కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి పై పోరాటం సాగించడానికి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 8నుండి16 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.

భారత్ లో కరోనా భయానక రికార్డ్ , 24 గంటల్లో 4.12 లక్షల కేసులు, 3,980 మరణాలుభారత్ లో కరోనా భయానక రికార్డ్ , 24 గంటల్లో 4.12 లక్షల కేసులు, 3,980 మరణాలు

కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించిన కేరళ సీఎం పినరయి విజయన్

కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించిన కేరళ సీఎం పినరయి విజయన్

చాలా రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్లు , నైట్ కర్ఫ్యూలు, వారాంతపు లాక్ డౌన్ లు ప్రకటించి కరోనా సెకండ్ వేవ్ తో పోరాటం సాగిస్తున్నాయి. కరోనా ను కట్టడి చేయడానికి వివిధ రకాలుగా నియంత్రణ చర్యలను తీసుకున్నాయి. అయితే తాజాగా కేరళ రాష్ట్రంలో భయంకరంగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పాజిటివిటీ పెరుగుతుందని పేర్కొన్న సీఎం పినరయి విజయన్ కరోనా కట్టడికి లాక్ డౌన్ తప్పడం లేదని వెల్లడించారు. మే 8 నుండి 16వ తేదీ వరకు కంప్లీట్ లాక్ డౌన్ చేయనున్నారు.

 కేరళలో భారీగా నమోదవుతున్న కేసులు . అందుకే కీలక నిర్ణయం

కేరళలో భారీగా నమోదవుతున్న కేసులు . అందుకే కీలక నిర్ణయం

గత నెలలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలపై ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ కరోనావైరస్ యొక్క రెండవ ఉప్పెనను సునామీ తో పోల్చారు . లాక్ డౌన్ లను చివరి అస్త్రంగా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.అయితే నిన్న ఒక్కరోజే కేరళలో 42వేల కరోనాకేసులు నమోదయ్యాయి.భారీగా నమోదవుతున్న కరోనాకేసులతో కేరళ రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది.అందుకే తాజాగా కఠినమైన లాక్ డౌన్ విధిస్తూ కేరళ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో మే 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు కేరళలో లాక్ డౌన్ కొనసాగనుంది.

లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు

లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు

లాక్డౌన్ సమయంలో అవసరమైన సేవలు, వైద్య,సేవల రంగాల వారికి మినహాయింపు ఇస్తారు. నిన్న, కేంద్ర అత్యున్నత శాస్త్రీయ సలహాదారు కరోనావైరస్ యొక్క "అనివార్యమైన" థర్డ్ వేవ్ గురించి హెచ్చరించాడు. ఆస్పత్రులలో మరణాల బారిన పడుతున్న,మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రజలను కాపాడటానికి టీకాలు నవీకరించబడాలి అని అన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రశ్నపై, ఎన్ఐటిఐ ఆయోగ్ సభ్యుడు మరియు వ్యాక్సిన్లపై జాతీయ నిపుణుల బృందం చీఫ్ వికె పాల్ ఏదైనా అవసరమైతే లాక్ డౌన్ నిర్ణయాలను సైతం తీసుకోవటానికి వెనకాడనవసరం లేదని వెల్లడించారు.

English summary
Kerala Chief Minister Pinarayi Vijayan on Thursday announced a statewide lockdown from May 8-16 to fight the surge in coronavirus cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X