హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్

|
Google Oneindia TeluguNews

'దరిద్రపుగొట్టు ఏడాది'.. 'పనికి మాలిన సంవత్సరం'.. 'ఛీ, చరిత్రలో 2020 పేజీని చింపిపారేయాలి'.. 'ఇలాంటి ఏడాదిని చూస్తామని జన్మలో అనుకోలేదు'.. 'దేవుడు వరమందిస్తే 2020ని తిరగరాయాలనుంది..' అంటూ 2020 ఏడాదిని నానా రకాలుగా తిట్టనివాళ్లంటూ లేరు. అవునుమరి, దేశదేశాలను స్తంభింపజేసి.. ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చి.. లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుని.. ఈ ప్రభావం నుంచి ఎప్పటికి కోలుకుంటామో అనే అంచనాలు కూడా లేకుండా చేసింది 2020 ఏడాది. కారణం కరోనా మహమ్మారి అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే, ఓవరాల్ గా ఈ ఏడాది ఆల్మోస్ట్ విషాదమయం అయినప్పటికీ, శృంగార ప్రియులకు మాత్రం మర్చిపోలేని అనుభూతుతిచ్చిందట..

షాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలంషాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలం

పట్టపగలే సెక్స్ కలాపాలు

పట్టపగలే సెక్స్ కలాపాలు

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన దేశవ్యాప్త లాక్ డౌన్ తొమ్మిది నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు నుంచి అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కటీ తెరుచుకుంటూ పోయినా, ఇప్పటికీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, విద్యాసంస్థలతోపాటు ఇంకొన్ని కీలక వ్యవస్థలు తెరుచుకోనేలేదు. సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా దేశంలోని మెట్రో నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. కార్యకలాపాలు పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే నడిచే నగరాల్లో ఆ మార్పును ఈజీగా పసిగట్టేశాయి సర్వీస్ సంస్థలు. లాక్ డౌన్ సమయంలో పట్టపగలే శృంగార కార్యకలాపాలు బాగా పెరిగిపోవడం అనేది 2020లో ప్రధానంగా నగరాల్లో వచ్చిన మార్పు అట.

 కండోమ్స్‌, ఐపిల్స్‌కు మస్తు గిరాకీ

కండోమ్స్‌, ఐపిల్స్‌కు మస్తు గిరాకీ

లాక్ డౌన్ సమయంలో జనం బయటతిరిగే అవకాశాలు తగ్గిపోవడంతో ఆన్ లైన్ ఆర్డర్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. స్ట్రిక్ట్ లాక్ డౌన్ కొనసాగిన సమయంలోనూ మెడికల్ సంబంధిత వస్తువులు అందుబాటులో ఉండటంతో జనం కొనుగోలు చేసిన వస్తువుల్లోనూ వాటి షేరే ఎక్కువగా ఉంది. సగం ఏడాదికిపైగా పూర్తి లాక్ డౌన్ లో ఉండిపోయిన భారత్ లో 2020కిగానూ ఆన్ లైన్ లో కండోమ్స్, గర్బనిరోధక మాత్రలైన ఐపిల్స్, పేపర్ రోల్స్ డెలివరీలు అమాంతం ఐదారింతలు పెరిగిపోయాయి. ఇండియాకు చెందిన ప్రముఖ ఆన్ లైన్ స‌ర్వీస్ యాప్ ‘డాంజో' 2020లో ఆన్ లైన్ కస్టమర్ల బిహేవియర్ పై విడుదల చేసిన రిపోర్టులో ఈ అంశాలు బహిర్గతం అయ్యాయి.

తీరని శృంగార దాహం

తీరని శృంగార దాహం

డాంజో యాప్ విడుదల చేసిన ‘ఆన్ లైన్ డెలివరీ ట్రెండ్-2020 రిపోర్ట్' ప్రకారం ఈ ఏడాదిలో రాత్రి పూట కంటే పగటిపూటే కండోమ్స్ ఆర్డర్‌లు సగటున మూడు రెట్లు ఎక్కువయ్యాయి. డాంజో యాప్ ద్వారానే ఈ స్థాయిలో పగటి పూట కండోమ్స్ కొన్నారంటే, మిగతా అన్ని యాప్ లను కలిపితే.. లాక్ డౌన్ లో పట్టపగలు రతిక్రీడలు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. కండోమ్స్ మాత్రమే కాదు, అవి వాడకుండా సెక్స్ లో పాల్గొన్నవాళ్లు కుటుంబ నియంత్రణ ఉత్పత్తులను కూడా భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లు డాంజో పేర్కొంది. అందులోనూ..

 సెక్స్ కేపిటల్ హైదరాబాద్?

సెక్స్ కేపిటల్ హైదరాబాద్?

లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా కండోమ్స్, కౌంటర్సెప్టివ్ ఐపిల్స్ లాంటివాటికి గిరాకీ మూడింతలు పెరిగితే.. హైదరాబాద్ లో మాత్రం ఒక్క కండోమ్స్ గిరాకీనే.. అదికూడా పట్టపగటి ఆర్డర్లు ఆరు రెట్లు పెరిగాయి. తద్వారా లాక్ డౌన్ సమయంలో భాగ్యనగరం శృంగార రాజధానిగా వర్ధిల్లినట్లయింది. హైదరాబాద్ లో ఆరు రెట్లు, చెన్నైలో ఐదు రెట్లు, జైపూర్ సిటీలో నాలుగు రెట్లు కండోమ్‌ల కొనుగోళ్ళు పెరిగాయని డాంజో రిపోర్టులో వెల్లడైంది. ఐటీ కేపిటల్ బెంగళూరులో మాత్రం రోలింగ్ పేపర్లు(పొగాకు, డ్రగ్స్ ను సిగరెట్లుగా చుట్టి పీల్చే పేపర్) వాడకం విపరీతంగా పెరిగింది. చెన్నై కంటే బెంగళూరులో 22 రెట్లు ఎక్కువగా రోలింగ్ పేపర్ ఆర్డర్లు వచ్చినట్లు డాంజో పేర్కొంది. ఇక..

ప్రెగ్నెన్సీ కిట్లు, ఐపిల్స్ వెల్లువ..

ప్రెగ్నెన్సీ కిట్లు, ఐపిల్స్ వెల్లువ..

లాక్ డౌన్ సమయంలో రాత్రీపగలూ రతి క్రీడలు పెరిగిన కారణంగా వచ్చే ఏడాది సాధారణం కంటే ఎక్కువ మంది బిడ్డలు పుట్టపోతున్నట్లు అంతర్జాతీయ సంస్థలు సైతం రిపోర్టులు ప్రచురించాయి. ఇండియాలోనూ ఆ పరిస్థితిని తీసిపారేయడానికి వీల్లేదన్నట్లుగా లాక్ డౌన్ వేళలో ప్రెగ్నెన్సీ టెస్టు కిట్లు, ఐపిల్స్ కు భారీగా ఆర్డర్లు వచ్చినట్లు డాంజో తెలిపింది. బెంగళూరు, పుణె, గురుగ్రామ్, హైదరాబాద్, ఢీల్లీలో అత్యధికంగా గర్భనిరోధక ఐపిల్ ట్యాబ్లెట్లకు ఆర్డర్స్ వచ్చాయని, అందరిలోకి జైపూర్‌లో అత్యధిక గర్భనిర్ధారణ వస్తు సామగ్రిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినట్లు వెల్లడైంది. ప్రేగ్నెన్సీ కిట్ల కొనుగోళ్లలో జైపూర్ టాప్ లో ఉంటే, శానిటరీ న్యాప్కిన్ల వాడకంలో చెన్నై అగ్రభాగన నిలిచింది. అదే సమయంలో..

సెక్స్ వేళలు, ఆహార అలవాట్లలో మార్పు..

సెక్స్ వేళలు, ఆహార అలవాట్లలో మార్పు..

సాధారణంగా రాత్రి సమయంలో సాగే సెక్స్ కలాపాలు కాస్తా లాక్ డౌన్ సమయంలో పగటి పూట కూడా కొనసాగాయి. ఇటు ఆహారం విషయంలోనూ జనం అలవాట్లు మారినట్లు రిపోర్టులో వెల్లడైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కాఫీ వాడకం పెరిగిందని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో ప్రజలు చ‌క్కెర కంటే ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం కోస‌మే ఎక్కువ ఆర్డ‌ర్లు చేశారని డాంజో తెలిపింది. చికెన్ బిర్యానీలో బెంగ‌ళూరు, దాల్ కిచ‌డీలో ముంబై, చెన్నైలో ఇడ్లీ, పుణెలో మ్యాగీకి ఎక్కువ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు స‌ర్వే తేల్చింది. ఢీల్లీలో ఎక్కువగా క్వినోవా, కాలే అలాగే ముంబైకి బ్రోకలీ, అవోకాడో ఇంకా పూణేలో బ్రౌన్ బ్రెడ్ ని ఎంచుకున్నారు. పెంపుడు కుక్కల కోసం గురుగ్రామ్‌లో అత్యధిక ఆర్డర్లు ఉండగా, బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్‌లో పిల్లుల ఫుడ్ కోసం ఆర్డర్ చేశారు.

బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణబిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ

English summary
Condoms, contraceptives and rolling paper- here are the most delivered items for Indian consumers in 2020. Indian consumers have ordered more condoms during the day than night, whereas the rolling paper purchase doubled in 2020 during the pandemic. These figures have been shared by Dunzo, a concierge service app who released its delivery trends report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X