వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కండోమ్‌లు ఇచ్చి రేపిస్టులకు సహకరించండి: దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఓ వైపు కామాంధులు కళ్లు కానరాక అమాయకమైన మహిళలపై అత్యాచారం లైంగిక దాడులకు పాల్పడుతుంటే వారి అమానుష చర్యను తప్పుపట్టాల్సిందిపోయి కొందరు సెలిబ్రిటీలు కూడా నోరు జారి విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఫిల్మ్‌మేకర్ డేనియేల్ శ్రావణ్ సోషల్ మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకిత జ్ఞానం కించిత్ కూడా లేకుండా పోస్టు చేశారు.

ఈ మృగాళ్లను ఏం చేయాలి: అమ్మాయిపై అత్యాచారం చేసి తుపాకీతో కాల్చి చంపి తగలబెట్టారుఈ మృగాళ్లను ఏం చేయాలి: అమ్మాయిపై అత్యాచారం చేసి తుపాకీతో కాల్చి చంపి తగలబెట్టారు

 కండోమ్‌లతో సహకరించండి

కండోమ్‌లతో సహకరించండి

"అత్యాచారానికి గురికాబోతున్నారా..? అయితే రేప్ చేసే వాడి చేతిలో ఒక కండోమ్ పెట్టండి. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని ముగించుకుని వెళ్లిపోతాడు" అని అత్యాచార బాధితుల గురించి ఫిల్మ్ మేకర్ డేనియేల్ శ్రావణ్ కామెంట్ చేశారు. అత్యాచారం గురైన తర్వాత దుర్మార్గులు మహిళలను హత్య చేస్తున్నారని చెప్పిన డేనియేల్ శ్రావణ్.. కండోమ్ చేతికిచ్చి కొంచెం సహకరిస్తే పనికానిచ్చేసి ప్రాణాలతోనైనా వదులుతారని అన్నారు. అంతేకాదు "హింస లేకుండా అత్యాచారం" పద్ధతిని అవలంబించాలంటూ పోస్టులు పెట్టారు. అత్యాచారం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం కాదని అయితే హత్య చేయడం అనేది క్షమించరాని నేరం అని శ్రావణ్ రాసుకొచ్చాడు. అత్యాచారం చేసి వదలకుండా ప్రాణాలు తీస్తున్నారని అదే సహకరిస్తే ప్రాణాలు దక్కుతాయి కదా అంటూ వివాదాస్పద పోస్టింగులు పెట్టారు.

ఇలా అయితేనే ప్రాణాలు దక్కుతాయి

ఇలా అయితేనే ప్రాణాలు దక్కుతాయి


అంతేకాదు హింసాకాండ లేని అత్యాచారంపై చట్టం చేయాలంటూ కారుకూతలు కూశారు. ఇలా చేయడం వల్ల బాధితులు ప్రాణాలతో ఉంటారని రాసుకొచ్చాడు. అత్యాచార బాధితులను ప్రాణాలతో దక్కించుకునేందుకు ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డాడు. దేశమంతా దిశా ఘటనపై ఆందోళనలు చేస్తున్న క్రమంలో డేనియేల్ శ్రావణ్ వివాదాస్పద పోస్టింగులు చేయడం విశేషం. ఇక దేశంలో ఇలాంటి అత్యాచార ఘటనలు జరగుతున్నాయంటే దీనికి ప్రధాన సూత్రధారులు సమాజం మరియు మహిళా సంఘాలే అని డేనియేల్ ధ్వజమెత్తారు.

నిర్భయ చట్టం అత్యాచారాన్ని నిలువరించలేదు

నిర్భయ చట్టం అత్యాచారాన్ని నిలువరించలేదు


ఇక డేనియేల్ కొన్ని సూచనలు కూడా చేశాడు. 18 ఏళ్ల పైబడిన అమ్మాయిలకు అత్యాచారంపై అవగాహన కల్పించాలని అదే సమయంలో మగవారు తమ కోరిక తీర్చమని అడిగినప్పుడు సహకరించాలని రాసుకొచ్చాడు. నిర్భయ చట్టం అత్యాచారాలను నిలువరించలేవని పేర్కొన్న డైరెక్టర్... మహిళలు ముందస్తు జాగ్రత్తగా కండోమ్‌లను తమతో పాటు తీసుకెళ్లాలని చెప్పాడు. హత్యకు గురికావడంకన్నా అత్యాచారంకు గురికావడం మేలని చెప్పాడు. అంతేకాదు రేప్ అనేది సరిదిద్దుకోవచ్చని అదే హత్య అనేది నేరం పాపం అని చెప్పాడు. ఒకవేళ మగాడి కోరికకు కాస్త సహకరిస్తే కచ్చితంగా అతను మహిళను చంపే అవకాశం లేదని చెప్పాడు. రేప్ అనేదాన్ని పోలీసులు, మహిళా సంఘాలు సీరియస్‌గా తీసుకోకుంటే హత్యలు జరగవని చెప్పాడు.

రేప్ నేరం కాదు.. హత్యే నేరం అంటున్నారా..?

ఇదిలా ఉంటే శ్రావణ్ చేసిన పోస్టింగులపై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో ఆ పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించాడు. అయితే ఈ పోస్టింగు చూసిన సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. మొత్తానికి రేప్ అనేది నేరం కాదని హత్య మాత్రమే నేరం అని డేనియేల్ శ్రావణ్ చెబుతున్నారని ట్వీట్ చేసింది చిన్మయి. అందులో డేనియేల్ శ్రావణ్ చేసిన మెసేజ్‌లను పోస్టు చేసింది. అమ్మాయిలు సహకరిస్తే రేప్ ఎందుకు చేస్తారని డేనియేల్ ఒక పోస్టులో ప్రశ్నించారు. భారత్‌కు వచ్చి తనకు స్నేహితులుగా ఉన్న అమ్మాయిలను, కుటుంబం నుంచి ఒపీనియన్ తీసుకోవాలని మరొకరు పోస్టు చేశారు.

English summary
Following the brutal Hyderabad rape-murder, some have suggested that rapists only kill the victims when they scream and shout and refuse to cooperate. Filmmaker Daniel Shravan asked for legalising rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X