వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో బీజేపీ, శివసేనదే అధికారం, గోయల్ జోస్యం, ఆర్టికల్ 370 దెబ్బ, సవాల్ !

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జోస్యం చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ, శివసేనలను ఆదరిస్తున్నారని, కచ్చితంగా మళ్లీ మాదే అధికారం అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్రలో పోలింగ్ జరుగుతున్న సందర్బంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సంకీర్ణ కూటమి 225 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు.ఆర్టికల్ 370 రద్దుతో తరువాత బీజేపీతో ప్రతిపక్షాలు మొదటి సారి శాసన సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి.

షాక్: మాజీ సీఎం సిద్దూ లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదు, బళ్లారి శ్రీరాములు!షాక్: మాజీ సీఎం సిద్దూ లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదు, బళ్లారి శ్రీరాములు!

 ప్రతిపక్షాల పోటీ లేదు

ప్రతిపక్షాల పోటీ లేదు

మహారాష్ట్ర, హర్యానాలో ఎక్కడా మాకు ప్రతిపక్షాలు పోటీ అని పించడంలేదని, పేరుకు మాత్రమే ఆ పార్టీలు పోటీ చేస్తున్నాయని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ల మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని, కచ్చితంగా వారి నాయకత్వాన్ని ఆదారిస్తారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

భారత్ భవిష్యత్తకు భరోసా !

భారత్ భవిష్యత్తకు భరోసా !

ప్రధాని నరేంద్ర మోడీ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, మహారాష్ట్రలో మళ్లీ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని, ప్రజా ప్రభుత్వం హక్కులు కాపాడటం కోసం, భారత భవిష్యత్తు కోసం ప్రజలు బీజేపీ, శివసేనకు ఓటు వెయ్యడానికి ముందుకు వస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశ భద్రత కోసం బీజేపీని ఆదరించాలని మహారాష్ట్ర, హర్యానా ప్రజలకు తాను మనవి చేస్తున్నానని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చెప్పారు.

4, 400 మంది భవిష్యత్తు

4, 400 మంది భవిష్యత్తు

4, 400 మంది అభ్యర్థులు శాసన సభ ఎన్నికల్లో వారి రాజకీయ భవిష్యత్తు పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలో 3, 237 మంది, హర్యానాలో 1,168 మంది పేర్లు ఈవీఎంలో దర్శనం ఇస్తున్నాయి. మహారాష్ట్రలో 288 నియోజక వర్గాల్లో, హర్యానాలో 90 శాసన సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలో 96, 661, హర్యానాలో 19, 578 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముంబై నగరంలో 40 వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

 ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి ఎన్నికలు

ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి ఎన్నికలు

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండో సారి ఈధికారంలోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండో సారి ప్రధాన మంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ రెండో సారి ప్రధాని కావడంతో జమ్మూ, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న తరువాత మొదటి సారి జరుగుతున్న శాసన సభ ఎన్నికలు కావడంతో అందరూ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రతిపక్షాలకు సవాల్

ప్రతిపక్షాలకు సవాల్

మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నిల ఫలితాలు ప్రతిపక్షాలకు సవాలుగా మారింది. సోమవారం జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రలతో పాటు 17 రాష్ట్రాల్లోని 51 శాసన సభ నియోజక వర్గాల్లో, రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో సోమవారం ప్రశాంతంగా పోటింగ్ జరుగుతోంది.

English summary
Union Minister Piyush Goyal on Monday exuded confidence in the win of the Bharatiya Janata Party (BJP) and the Shiv Sena alliance in the Maharashtra Assembly election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X