అదే నిజమైంది: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహం
Recommended Video
టస్కనీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తమ జీవితాకు సంబంధించిన ఆనంద సమయాన్ని ఇరువురు తారలు అభిమానులతో పంచుకున్నారు. 'ఎప్పటికీ ప్రేమలో ఉండటానికి ఈ రోజు మేం పరస్పరం వాగ్ధానం చేసుకున్నామని ప్రకటించారు.
ఈ మరపురాని రోజుకు సంబంధించిన విషయాలను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ప్రకటించారు. అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది.
ప్రపంచంలోనే అత్యంత ఖర్చైన హాలిడే స్పాట్లో ఈ పెళ్లి జరిగింది. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభే నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న బోర్గో ఫినాచెజియో విల్లాలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చేశారు.
పెళ్లి తర్వాత డిసెంబర్ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు.