వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నాగా’లో ఎన్డీపీపీ - బీజేపీ పైచేయి: మేఘాలయలో కాంగ్రెస్‌ కష్టాలు?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Nagaland Assembly Elections

గౌహతి: ఈశాన్య భారత రాజకీయ చరిత్రలో మంగళవారం మరొక కీలక ఘట్టం పూర్తి కానున్నది. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరుగనున్నది. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముకుల్ సంగ్మా సారథ్యంలోని ప్రభుత్వం మళ్లీ ప్రజాతీర్పు అనుకూలంగా పొందేందుకు ఆపసోపాలు పడుతోంది. కన్రడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), బీజేపీ ముకుల్ సంగ్మా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎలుగెత్తి చాటాయి.
మరోవైపు నాగాలాండ్ రాష్ట్రంలో అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు మాజీ సీఎం నైప్యూ రియో సారథ్యంలోని నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీలతో కూడిన కొత్త కూటమి గట్టి సవాల్ ఎదురవుతోంది.

బీజేపీ - ఎన్పీపీలది కోవర్టు రాజకీయం అని కాంగ్రెస్ ఎదురుదాడి

బీజేపీ - ఎన్పీపీలది కోవర్టు రాజకీయం అని కాంగ్రెస్ ఎదురుదాడి

మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలకు 47 స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షమైన ప్రాంతీయ పార్టీ నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దీన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ రాజకీయం అని ఆరోపిస్తోంది. పక్కనే ఉన్న మణిపూర్ రాష్ట్రంలోనూ బీజేపీకి ఎన్పీపీ మిత్రపక్షంగా ఉండటం గమనార్హం. అంతే కాదు నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్ఈడీఏ)లో భాగస్వామ్య పక్షాలుగా ఎన్పీపీ, యూడీపీ కూడా బీజేపీకి సహజ మిత్ర పక్షాలే కావడం గమనార్హం. ప్రగతి నినాదంతోపాటు ఈశాన్యంలో అత్యధిక ప్రభావితం చేయగల క్రైస్తవుల మనస్సులు చూరగొనేందుకు స్వదేశీ దర్శన్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టినా క్రిస్టియన్లు దూరంగా ఉన్నారు.

ఎన్పీఎఫ్‌తో 15 ఏళ్ల పొత్తుకు కమలనాథులు ఇలా రాంరాం

ఎన్పీఎఫ్‌తో 15 ఏళ్ల పొత్తుకు కమలనాథులు ఇలా రాంరాం

నాగాలాండ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు నూతనంగా ఏర్పాటైన ఎన్డీపీపీ - బీజేపీ కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. మాజీ సీఎం రియో సారథ్యంలోని ఎన్డీపీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ.. 15 ఏళ్లుగా ఎన్పీఎఫ్‌తో ఉన్న పొత్తు తెగదెంపులు చేసుకున్నది. ఎన్డీపీపీ 40 స్థానాలకు, బీజేపీ మిగతా స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల కూటమి ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని విశ్వాసంతో ఉన్నాయి.

మార్చి మూడో తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

మార్చి మూడో తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

రెండు రాష్ట్రాల్లోనూ 60 స్థానాలకు చెరి 59 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరుగనున్నది. మేఘాలయలో ఎన్సీపీ అభ్యర్థి జొన్నాథోన్ ఎన్ సంగ్మా హత్యకు గురి కావడంతో ఆ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. ఇక నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్డీపీపీ అభ్యర్థిగా మాజీ సీఎం - నైప్యూ రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరిగిన త్రిపురతోపాటు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేనెల మూడో తేదీన వెలువడనున్నాయి.

అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించిన కాంగ్రెస్

అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించిన కాంగ్రెస్

ఇప్పటికే రెండుసార్లు మేఘాలయలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ, కేంద్ర మంత్రులు ప్రచారంతో హోరెత్తించారు. బీజేపీ పునాదులు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్న సంకేతాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో తన అస్త్రశస్త్రాలను ప్రయోగించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు సభల్లో మాట్లాడారు. అన్ని స్థానాల్లో పోటీ చేయడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నదని ఎన్పీపీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.

నాగా సమస్య పరిష్కారానికి వేర్పాటు వాద సంస్థల బహిష్కరణాస్త్రం?

నాగా సమస్య పరిష్కారానికి వేర్పాటు వాద సంస్థల బహిష్కరణాస్త్రం?

మరోవైపు బీజేపీ ప్రగతి నినాదంతో హోరెత్తిస్తూనే మరోవైపు కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టింది. క్రైస్తవుల అనుకూల పార్టీ బీజేపీ అన్న వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నాగాలాండ్‌లో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తానని బీజేపీ - ఎన్డీపీపీ బ్లూ ప్రింట్ ప్రజల ముందు ఉంచింది. ‘నాగా'లు ఎదుర్కొంటున్న వేర్పాటువాద సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని అప్పటి వరకు ఎన్నికలను బహిష్కరించాలని పలు వేర్పాటువాద సంస్థలు పిలుపు ఇచ్చాయి. తొలుత ఈ పిలుపులో ప్రధాన రాజకీయ పార్టీలు భాగస్వాములైనా తర్వాత వెనుకడుగు వేశాయి.

English summary
GUWAHATI: With the assembly polls scheduled to take place in Meghalaya and Nagaland on Tuesday , the ruling Congress led by Chief Minister Mukul Sangma is facing an uphill task to retain power in Meghalaya where the NPP and BJP have resorted to high-octane electioneering harping on the ‘failures’ of the incumbent Congress government while in Nagaland the ruling Nagaland People’s Front (NPF) is being challenged by the newly-formed alliance of NDPP and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X