వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ లోకల్ పోల్స్: 36-12 పట్టు నిలుపుకున్న కాంగ్రెస్, పరువు కాపాడుకున్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్.. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలను సాధించింది. 50 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 36 మున్సిపాలిటీలను గెలుచుకుంది.

అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా?

ఇక ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ 12 మున్సిపాలిటీలను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్రులు రెండింటిని కైవసం చేసుకున్నారు. జైపూర్ జిల్లాలో 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా.. తొమ్మిదింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బంగ్రు మున్సిపల్ బోర్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతోంది.

 Congress bags 36 municipal boards, BJP 12 in Rajasthan local polls

ఛక్సు, ఛోము, జోబ్నర్, కిషనగఢ్ రెన్వల్, కోట్పట్లి, ఫులేరా, సంభార్ లేక్, షాపూర, విరాట్‌నగర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గంగానగర్‌లోని 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో నాలుగింటిలో విజయం సాధించాయి.

అల్వార్‌లోని ఆరు మున్సిపాలిటీల్లో బీజేపీ నాలుగు, కాంగ్రెస్ 2 మున్సిపాలిటీలను గెలుచుకున్నాయి. బరన్‌లోని రెండు మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. భరత్‌పూర్, దౌసాలోని 11 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది.

ధోలపూర్‌లోని 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 2, ఇండిపెండెంట్ ఒక స్థానం గెలుచుకున్నారు. జోధ్‌పూర్‌లోని 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీలో చెరోటి దక్కించుకున్నాయి. కరౌలిలోని మూడు మన్సిపాలిటీల్లో అన్నింటినీ కాంగ్రెస్ గెలుచుకుంది. కోటాలోని రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీలో చెరోటి కైవసం చేసుకున్నాయి.

ఈ విజయాల అనంతరం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసర ట్విట్టర్ వేదికగా తన హర్షాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఢతలు తెలిపారు. తాము ఊహించిన ఫలితాలే వచ్చాయని చెప్పారు.

కాగా, ఇంతకుముందు 12 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో 1775 వార్డులకు గానూ కాంగ్రెస్ 619 స్థానాల్లో గెలుపొందగా.. 595 మంది స్వతంత్రులు విజయం సాధించారు. 549 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ 41 మున్సిపాలిటీలను దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఇతర పార్టీల విషయానికొస్తే బీఎస్పీ 7 వార్డుల్లో, సీపీఎం, సీపీఐ చెరో రెండు వార్డుల్లో విజయం సాధించగా, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఒక స్థానం గెలుచుకుంది.

కాగా, ఇటీవల పజరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుకుంది. 21 జిల్లాల్లో 636 జిల్లా పరిషత్ స్థానాలకు గానూ బీజేపీ 353 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 252 విజయం సాధించింది.

English summary
In a major boost to Congress after a relatively poor show in the recently-concluded panchayat polls, the party won 36 municipal boards of the 50 where elections to the posts of chairpersons concluded on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X