వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ కార్యకర్తలు "అలర్ట్".. పోలింగ్ బాక్సులకు "సెక్యూరిటీ"

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్ గడ్ : ఎన్నికల ప్రచారం, పార్టీల హడావుడి.. మొత్తానికి ఛత్తీస్ గఢ్ పోలింగ్ ముగిసింది. పోలీస్ బందోబస్తు, కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ వెళ్లిపోయారు. అయితే పోలింగ్ బాక్సులకు "సెక్యూరిటీ" చర్చానీయాంశంగా మారింది. సాధారణంగా ఎన్నికలు ముగిశాక ఈవీఎం బాక్సులను సెక్యూరిటీ జోన్ లో ఉంచుతూ పోలీస్ పహారా పెడతారు. కానీ ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ బాక్సులకు కాపలా కాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఛత్తీస్ గఢ్ లో గత పదిహేనేళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు భయం పుట్టిస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల ఫలితాలు తారుమారు చేయొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే భటాగవ్ నియోజకవర్గంలో ఈవీఎం లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర కాపలాకు సిద్ధమయ్యారు. అంతేకాదు దీనికోసం పోలీస్ అధికారుల పర్మిషన్ కూడా తీసుకున్నారు.

అందుకేనా కాంగ్రెస్ సెక్యూరిటీ?

అందుకేనా కాంగ్రెస్ సెక్యూరిటీ?

ఛత్తీస్ గడ్ లోని 90 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. అయితే 71.93 శాతం పోలింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పదిహేనేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. అటు పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటం.. ఇటు విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు అలర్టయ్యారు. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడుతుండటంతో సమయం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఫలితాలు తారుమారు చేయొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో భటాగావ్ కాంగ్రెస్ అభ్యర్థి ఒక అడుగు ముందుకేసి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర కార్యకర్తలను సెక్యూరిటీగా ఉంచారు.

 అటు పోలీసులు, ఇటు కాంగ్రెసోళ్లు.. ఫుల్ సెక్యూరిటీయా?

అటు పోలీసులు, ఇటు కాంగ్రెసోళ్లు.. ఫుల్ సెక్యూరిటీయా?

ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదంటున్నారు భటాగావ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రాస్‌నాథ్ రాజ్వాడే. అధికారం కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నామని.. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తమకు అవకాశాలు చేజారిపోతాయని చెబుతున్నారు. మళ్లీ గెలవాలనే యావతో ఉన్న బీజేపీ అక్రమాలకు పాల్పడే ఛాన్సుందని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో ఈవీఎంలు భద్రపరిచిన చోట సీసీ కెమెరాలు కూడా లేవని మండిపడ్డారు. అందుకే తామే సెక్యూరిటీగా ఉండేందుకు సిద్దమయ్యామని చెప్పారు.
దీంతో షిఫ్టుల చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు ఈవీఎం బాక్సులకు సెక్యూరిటీగా ఉంటున్నారు. పోలీసులతో కలిసి ఈవీఎం బాక్సులకు కాపలా కాస్తున్నారు.

పోలీస్ పర్మిషన్..!

పోలీస్ పర్మిషన్..!


ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల పరిసరాల్లో సాధారణంగా ఎవరినీ అనుమతించరు. అయితే బీజేపీ పై అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఈవీఎం లకు సెక్యూరిటీ గా ఉంటామంటూ పోలీసుల పర్మిషన్ తీసుకున్నారు. ఈవీఎం లను బీజేపీ ట్యాంపరింగ్ చేసే అవకాశముండటంతోనే తమ కార్యకర్తలు 24 గంటలు డేగ కళ్లతో కాపాలా కాస్తున్నారని తెలిపారు స్థానిక నేతలు. అదలావుంటే బెమెతరా జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ లకు తాళాలు వేసిన పోలీసులు కిటికీలు, గుమ్మాల దగ్గర రక్షణ నిమిత్తం గోడలు నిర్మించడం కొసమెరుపు.

English summary
Congress activists are guarding EVM Strong rooms in Bhattagavu constituency in Chhattisgarh. Security is part of the suspected of reversing election results. The decision was made because the strong rooms did not have a cc cameras. Congress workers working in shifts as security to EVM boxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X