వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ ఇలాకా నుంచే కాంగ్రెస్ క్యాంపెయిన్ .. ప్రియాంక, హర్థిక్ రాకతో శ్రేణుల్లో జోష్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల సమరం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసి అన్ని పార్టీల కన్నా ముందువరుసలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ .. ప్రధాని మోదీ ఇలాకాలో ప్రచారం ప్రారంభిస్తోంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశం మంగళవారం అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రియాంక గాంధీ, హర్థిక్ పటేల్ ప్రచారం చేసే అవకాశం ఉంది.

<strong>వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్</strong>వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

మోదీ ఇలాకాలో ..

మోదీ ఇలాకాలో ..

సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యనేతలు, సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. యూపీ పశ్చిమ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకగాంధీ సీడబ్ల్యూసీ తొలి సమావేశానికి హాజరుకానున్నారు. ప్రియాంక కాంగ్రెస్ పార్టీ తురుపుముక్కగా భావిస్తూ .. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో ప్రచారం చేపడుతారు. ఇటు గుజరాత్ లో పాటిదార్ ఆందోళన్ సమితి వ్యవస్థాపకుడు హర్థిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరడం హస్తం పార్టీకి కలిసొస్తోంది. పాటిదార్ సామాజిక వర్గం, యువత ఓటుబ్యాంకు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఏం చేద్దాం ...

ఏం చేద్దాం ...

మోదీ ఇలాకా అహ్మదాబాద్ లో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా లోక్ సభ ఎన్నికల వ్యుహాలపై చర్చిస్తారు. ఎన్నికల్లో ఎలా వెళదాం ? ఈ ఐదేళ్లలో హామీల అమలులో విఫలమైనా మోదీ ? నిరుద్యోగులకు ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పించడంలో విఫలమయ్యారనే అంశాలను ప్రధానంగా ప్రస్తావించే ఛాన్స్ ఉంది. దీంతోపాటు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని రాహుల్ ఇదివరకే ప్రకటించినందునా .. ఈ పథకం మేనఫెస్టో లో ముందువరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

58 ఏళ్ల తర్వాత .. ఉప్పు సత్యగ్రహం రోజునే ...

58 ఏళ్ల తర్వాత .. ఉప్పు సత్యగ్రహం రోజునే ...

1961లో గుజరాత్ లో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. దాదాపు 58 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి భేటీ గుజరాత్ లో నిర్వహిస్తున్నారు. దీంతోపాటు మంగళవారానికి మరో ప్రాధాన్యం ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మహాత్మాగాంధీ ఉప్పుపై పన్ను నిరసిస్తూ ఉప్పు సత్యగ్రహం చేపట్టింది కూడా ఈ రోజే. ఈ విధంగా రెండు ముఖ్య ఘట్టాలను పోలి .. సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది.

English summary
Congress is all set to launch its 2019 Lok Sabha poll campaign from Prime Minister Narendra Modi's bastion Gujarat today (March 12). The principal opposition party will chart out key strategies to contest the Lok Sabha elections against the Bharatiya Janata Party. The key Congress meet comes on March 12 which also marks the anniversary of famous Dandi March by Mahatma Gandhi. The Congress Working Committee (CWC) is significant as it will be Priyanka Gandhi Vadra's first meeting of the committee as the party's newly appointed general secretary of eastern Uttar Pradesh. Patidar leader Hardik Patel is also expected to be inducted into Congress to give a major boost to the party ahead of the Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X