వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిస్టోల్ చేతబట్టిన కాంగ్రెస్ నేత త్రిపాఠి,బుల్లెట్‌తో బ్యాలెట్‌ను శాసిస్తారా బీజేపీ ఫైర్,ఈసీ నివేదిక

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 స్థానాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకే ముగిసింది. కానీ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య గొడవలు మాత్రం జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా పిస్టోల్ పట్టుకొని రావడం కలకలం రేపింది.

Priyanka reddy murder: ఆగని ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్, షాద్ నగర్ పీఎస్ గేట్లకు బేడీలుPriyanka reddy murder: ఆగని ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్, షాద్ నగర్ పీఎస్ గేట్లకు బేడీలు

వస్తూనే.. తుపాకీ తీసి..

వస్తూనే.. తుపాకీ తీసి..

ఎన్నికల సందర్భంగా పాలము జిల్లా డాల్‌టొన్డ్‌గంజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైన్‌పూర్ బ్లాక్ వద్ద గల పోలింగ్ బూత్ వద్ద బీజేపీ నేత అలోక్ చౌరసియా మద్దతుదారుల, కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. అక్కడికొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సిబ్బంది నుంచి తుపాకీ తీసుకొవడంతో కలకలం రేపింది. త్రిపాఠి భద్రత సిబ్బంది మధ్య ఉన్న ఫోటో ఒకటి వైరలైంది.

గొడవకు కారణమిదీ..

గొడవకు కారణమిదీ..

కోషియారి వద్ద గల మాధ్యమిక పాఠశాలలో త్రిపాఠి కాన్వాయ్‌ను బీజేపీ మద్దతుదారులు అడ్డుకొన్నారు. ఇది చౌరసియాకు పట్టున్న ప్రాంతం కావడం విశేషం. 72, 73వ బూత్ వద్దకొచ్చేసరికి వెళ్లనీయలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో త్రిపాఠి తుపాకీ తీసుకొని బెదిరించే ప్రయత్నం చేశారు. అలా ఆయన చేతిలో తుపాకీ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.

రాళ్లతో దాడి..

రాళ్లతో దాడి..

త్రిపాఠి కాన్వాయ్‌ను బీజేపీ మద్దతుదారులు వెంబడించారు. రాళ్లతో దాడులు చేశారు. దీంతో కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. దాడి నుంచి త్రిపాఠిని అతని అంగరక్షకులు కాపాడగలిగారు. తర్వాత దాడి చేసింది తాము కాదని ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు.

వెంట్రుకవాసిలో

వెంట్రుకవాసిలో

చౌరాసియా మద్దతుదారుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నానని త్రిపాఠి పేర్కొన్నారు. వారు తన ఫార్చూనర్ వాహనంపై రాళ్లతో తెగబడ్డారని పేర్కొన్నారు. ఘటనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొస్తానని పేర్కొన్నారు. అయితే తనకు సీనియర్ పోలీసులు, అధికారులు తగిన భద్రత కల్పించలేదని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో హోంగార్డులనే కేటాయించారని ఆరోపించారు. అంతేకాదు అధికార పార్టీ అభ్యర్థికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు.

బుల్లెట్‌తో బ్యాలెట్..

బుల్లెట్‌తో బ్యాలెట్..

త్రిపాఠిపై బీజేపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకుంటారా అని ఆరోపించారు. తుపాకీ పట్టుకోవడంతో త్రిపాఠి తన విశ్వసనీయతను కోల్పోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ నాథ్ సహదేవ్ పేర్కొన్నారు. బ్యాలెట్ ఎన్నికలను బుల్లెట్‌తో శాసిస్తారా అని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.

English summary
Congress candidate KN Tripathi brandished pistol supporters clash BJP candidate Alok Chaurasiya polling booth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X