Pranab Mukherjee Passes Away:పదవులకే వన్నెతీసుకొచ్చారు.. శర్మిష్టకు సోనియా లేఖ..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో కాంగ్రెస్ శ్రేణులు విషాద వదనంలో మునిగిపోయారు. ప్రణబ్ మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రణబ్ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠకు సోనియా లేఖ రాశారు.

ప్రణబ్ కొద్దిరోజులగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అని సోనియా లేఖ స్టార్ట్ చేశారు. కానీ ఆయన లేరనే విషయం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రణబ్ ముఖర్జీ పోషించిన పాత్రను గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో ముఖ్య పోషించారని తెలిపారు. ప్రణబ్ మేధాశక్తి తోడు లేకుండా ఇప్పుడు మేం ఎలా మనుగడ సాగించగలమో ఊహించలేకపోతున్నామని సోనియా అన్నారు. ప్రణబ్ అనుభవం, సలహాలు, లోతైన అవగాహన శక్తితో తోడుగా ఉండేవారన్నారు.
ప్రణబ్ ముఖర్జీ చేపట్టిన ప్రతి పదవికి వన్నె తీసుకొచ్చారని సోనియా అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించారని తెలిపారు. క్రియాశీల రాజకీయనాయకుడిగా, కేబినెట్ మంత్రిగా, రాష్ట్రపతిగా పలు ఘట్టాలకు రూపునివ్వడంలో ఆయన పోషించిన పాత్ర అమోఘం అన్నారు. ప్రణబ్ మృతి పార్టీకి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు.
ప్రణబ్ మృతితో కాంగ్రెస్ పార్టీ శోకిస్తోందన్నారు. ఆయన జ్ఞాపకాలు కాంగ్రెస్ పార్టీ హృదయంలో చిరస్మరణీయంగా ఉంటాయని చెప్పారు. విషాద సమయంలో మీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి కలుగుగాక అని తన లేఖను సోనియా ముగించారు.