• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ మేథోమథనంలో కీలక చర్చ-గాంధీల్లేని నాయకత్వం-ఫ్యామిలీకి ఒకే టికెట్-మరెన్నో..

|
Google Oneindia TeluguNews

వరుస ఓటములతో దేశవ్యాప్తంగా వేగంగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో నిర్వహిస్తున్న చింతన్ శివిర్ పలు సంచలనాలకు వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ వరుస ఓటములకు గల కారణాలపై నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న అధిష్టానం వాటిపై తీసుకోబోయే నిర్ణయాలు పార్టీ రూపురేఖల్ని మార్చేలా కనిపిస్తోంది. ఇందులో నాయకత్వ మార్పుతో పాటు పలు కీలక అంశాలు ఉన్నాయి.

గాంధీల్లేని కాంగ్రెస్ నాయకత్వం

గాంధీల్లేని కాంగ్రెస్ నాయకత్వం


శతాభ్దానికి పైగా గాంధీల నాయకత్వంలో పలు గెలుపోటములతో ప్రస్ధానం సాగించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వారే భారంగా మారారు. ముఖ్యంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో వారు చూపుతున్న అలసత్వం పార్టీకి ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజస్తాన్ చింతన్ శివిర్ లో కాంగ్రెస్ ముఖ్యనేతలు దీనిపై కీలకంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా గాంధీల నాయకత్వం లేకుండా కాంగ్రెస్ ఎంత మేరకు పనిచేయగలుగుతుందనే దానిపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అలాగే గాంధీల నాయకత్వాన్నే పార్టీలో మెజారిటీ వర్గం కోరుకుంటే ఏం చేయాలనే దానిపైనా చర్చిస్తున్నారు.

 ఫ్యామిలీకో టికెట్ మాత్రమే

ఫ్యామిలీకో టికెట్ మాత్రమే

కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి నేతల కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ పదవులు ఇవ్వడం. దీంతో మిగతా నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో అమలు చేసిన ఒక కుటుంబానికి ఒకే టికెట్ రూల్ ను అమల్లోకి తీసుకురావాలనే అంశంపై పార్టీ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇందులో కేవలం గాంధీ కుటుంబానికి మాత్రమే మినహాయింపు ఇవ్వాలని అత్యధికులు కోరుతున్నారు.

 రాజ్యసభ సభ్యుల టర్మ్ ల్లో కోత

రాజ్యసభ సభ్యుల టర్మ్ ల్లో కోత

అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరికీ, ముఖ్యంగా ప్రజల్లో లేకుండా రాజ్యసభకు నామినేట్ అవుతున్న వారికి ఇలా ఎంతకాలం పదవులు ఇచ్చుకుంటూ వెళ్లాలనే దానిపైనా చింతన్ శివిర్ లో చర్చిస్తున్నారు. ఇందులో రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలంటే ఓ పరిమితి ఉండాలనే అంశాన్ని ఎక్కువ మంది లేవనెత్తినట్లు తెలుస్తోంది. దీంతో రాజ్యసభ సభ్యుల టర్మ్ కు పరిమితి పెట్టాలనే అంశంపై నేతలు దృష్టిసారించారు. దీనిపై అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం ఉంటుంది.

పార్టీలో సగం సీట్లు 50 ఏళ్ల లోపు వారికే

పార్టీలో సగం సీట్లు 50 ఏళ్ల లోపు వారికే

కాంగ్రెస్ పార్టీలో వృద్ధ నాయకత్వమే సమస్యగా మారిందన్న విమర్శల నేపథ్యంలో ప్రతీ స్దాయిలోనూ సగం సీట్లు 50 ఏళ్ల లోపు వారికే వదిలేయాలనే అంశంపైనా ఇవాళ చర్చ జరుగుతోంది. ఇలా సగం సీట్లు పార్టీలో యువతగా పిలుచుకునే 50 ఏళ్ల లోపు వారికి వదిలేయడం ద్వారా పార్టీలోనూ యువరక్తం కనిపిస్తుందని, యువతకు అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. దీంతో ఈ వాదనకు మద్దతు కూడా లభిస్తోంది. అలాగే పార్టీలో ఏ వ్యక్తి ఐదేళ్లకు మించి పదవిలో ఉండకూడదని, మూడు సంవత్సరాల పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలని అజయ్ మాకెన్ చెప్పారు.

 కాంగ్రెస్ పునర్ వైభవానికి ఆరు గ్రూపులు

కాంగ్రెస్ పునర్ వైభవానికి ఆరు గ్రూపులు


దేశవ్యాప్తంగా పెరుగుతున్న మతపరమైన పోలరైజేషన్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చింతన్ శివిర్ లో చర్చ జరుపుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం కోసం ఆరు అంశాలపై కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో పార్టీ సంస్ధాగత వ్యవహారాలు, దేశంలోని ఆర్థిక, రాజకీయ పరిస్థితి, సామాజిక న్యాయం, రైతులు, యువతకు సంబంధించిన విషయాలపై ఈ గ్రూప్ లు పనిచేస్తాయి. ఇలా ఏర్పాటు చేసే ప్రతీ గ్రూప్ లోనూ 60 నుంచి 70 మందిని నియమించాలని పార్టీ భావిస్తోంది. దీనిపై చింతన్ శివిర్ చివర్లో రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

English summary
congress party's ongoing chintan shivir in rajastan's udaypur has been discussing on range of issue including leadership, elections, etc;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X