వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు కష్టకాలం: రాహుల్ నివాసానికి ప్రియాంకా, గెహ్లాట్, సచిన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామాను కాంగ్రెస్ హైకమాండ్ తిరస్కరించింది. ఇక తనకు ఆ పదవి చేపట్టడం ఇష్టం లేదని రాహుల్ గాంధీ బాహాటంగానే చెప్పేశారు కూడా. ఇక సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత రాహుల్ గాంధీ ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఆ పార్టీ సంక్షోభం దిశగా వెళుతోందా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు తన రాజీనామాను అంగీకరించాల్సిందిగా బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ఇందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకోవడం లేదు. మరోవైపు రాహుల్ గాంధీ సీనియర్ నాయకుడైన అశోక్ గెహ్లాట్‌ను కూడా కలిసేందుకు ఇష్టపడని నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ, సచిన్ పైలట్లు రాహుల్ నివాసానికి చేరుకున్నారు. వీరితో పాటు అశోక్ గెహ్లాట్, రణదీప్ సూర్జేవాలా కూడా రాహుల్ నివాసానికి చేరుకుని కాంగ్రెస్‌ ఓటమికి సమీక్ష జరుపుతున్నారు. రాహుల్‌కు అత్యంత సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ కూడా రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Congress crisis deepen, Priyanka, Sachin and Ashok Gehlot rushes to Rahuls residence

శనివారం జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ తన రాజీనామాను సమర్పించారని అయితే అధిష్టానం తిరస్కరించిందని ఆ పార్టీ చెప్పింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఇష్టపడంలేదని చెప్పిన రాహుల్...త్వరలోనే తన స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండ్రోజులుగా రాహుల్‌ను కలవాలని అశోక్ గెహ్లాట్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన్ను కలిసేందుకు రాహుల్ నిరాకరించారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పలువురు సీనియర్ నాయకులను పార్టీ కోసం పనిచేయకుండా వారికుటుంబం కోసం పనిచేశారనే విమర్శలు చేశారు. రాహుల్ విమర్శలు చేసిన వారిలో అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్, చిదంబరంలాంటి వారున్నారు . వారు పార్టీ కోసం కాకుండా తమ కుమారుల కోసం పనిచేశారని విమర్శించారు.

English summary
UP east General secretary Priyanka Gandhi and Sachin Pilot rushed to Rahul Gandhis residence to sort out the deep crisis that occured in the Party. Rahul Gandhi who tendered his resignatin top the party's top post was rejected by the high command. In this back drop Rahul was reluctant to meet any top leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X