వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పను ఆహ్వానిస్తే కాంగ్రెస్ తీవ్రనిర్ణయం:ఆ ఎమ్మెల్యేలు రిసార్టులకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక ఓటర్లు హంగ్ తీర్పు చెప్పడంతో బెంగళూరులో రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు యెడ్యూరప్ప గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఓ హోటల్లో జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామి తదితరులు సమావేశమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మధుయాష్కీ గౌడ్‌లు భేటీ అయ్యారు.

బీజేపీదే ఆధిక్యం కానీ, జేడీఎస్ కింగ్! కాంగ్రెస్‌కు 78: అదునుచూసి దెబ్బకొట్టిన అమిత్ షాబీజేపీదే ఆధిక్యం కానీ, జేడీఎస్ కింగ్! కాంగ్రెస్‌కు 78: అదునుచూసి దెబ్బకొట్టిన అమిత్ షా

యెడ్డీని ఆహ్వానిస్తే కోర్టుకు

యెడ్డీని ఆహ్వానిస్తే కోర్టుకు

గవర్నర్ తమను కాకుండా యెడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే కోర్టుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు ఉన్నాయి. మరోవైపు, ఆ రెండు పార్టీలు అనుమానం ఉన్న వ్యక్తులను రిసార్టులకు తరలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే కొందరు ఎమ్మెల్యేలను ఏకంగా పంజాబ్, ఏపీ తదితర రాష్ట్రాల్లోని రిసార్టులకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

78 మంది ఎమ్మెల్యేలకు 50 మంది హాజరు

78 మంది ఎమ్మెల్యేలకు 50 మంది హాజరు

కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఇధ్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు కూడా వచ్చారని తెలుస్తోంది. అయితే, మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. అయితే వారిని రిసార్టుకు తరలించారా? అందులో ఎవరైనా బీజేపీకి అనుకూలంగా ఉన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.

గవర్నర్ నిర్ణయమే

గవర్నర్ నిర్ణయమే

ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇప్పుడు పొలిటికల్ సీన్ మొత్తం రాజ్‌భవన్‌కు మారింది. గవర్నర్ వజూభాయ్ వాలా తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి పడింది. అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇలా చేయాలి

ఇలా చేయాలి

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. బల నిరూపణ కోసం ఆ పార్టీకి గడువు ఇవ్వడం.
కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కుమారస్వామిని ఆహ్వానించడం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరడం. ఈ రెండు పార్టీలకు కలిపి 116 సీట్లు ఉన్నాయి. దీంతో, మ్యాజిక్ ఫిగర్ కంటే ఈ కూటమికి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడోది ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా అసెంబ్లీని సస్పెన్షన్ లో ఉంచడం.

English summary
The Congress has decided that it would approach the court in case the Governor invites the BJP first to form the government. Rahul Gandhi spoke with Ghulam Nahi Azad and said that the party should go all hog to ensure that the government is formed in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X