వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ యాప్‌ నుంచీ డేటా లీకేజి!? బీజేపీ ఆరోపణలు, ముందుగానే డిలీట్ చేసిన కాంగ్రెస్‌

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తన యాప్‌ 'ఐఎన్‌సీ'ని డిలీట్ చేసింది. ఐఎన్‌సీ యాప్‌లోనూ భారీ స్థాయిలో సెక్యూర్టీ ఉల్లంఘన జరిగిందని ఫ్రాన్స్‌కు చెందిన ఇలియట్ అండర్సన్ అనే సైబర్ సెక్యూరిటీ నిపుణుడు తెలిపాడు.

పార్టీ సభ్యత్వం కోసం ఐఎన్‌సీ యాప్‌కు దరఖాస్తు చేసుకుంటే, దాని నుంచి యూజర్‌కు సంబంధించిన పర్సనల్ డేటా ఓ హెచ్‌టీటీపీ లింకు ద్వారా లీకవుతుందని అతను ఆరోపించాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త పడింది.

వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఎన్‌సీ యాప్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. సభ్యత్వం కోసం ఇచ్చిన డేటా హెచ్‌టీటీపీఎస్‌లో ఎన్‌కోడ్ అయి ఉంటే డేటా లీకేజికి ఆస్కారం ఉండేదికాదని, కానీ అలాకాకుండా డేటా హెచ్‌టీటీపీలో ఎన్‌కోడ్ అయి ఉందని, అందుకే పర్సనల్ డేటా సలువుగా చోరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్రెంచ్ సైబర్ భద్రతా నిపుణుడు ఇలియట్ అండర్సన్ తెలిపాడు.

Congress deleted its Android app from Google Play Store?

అంతేకాదు, ఈ విషయం గురించి తాను ట్వీట్ చేయడానికి ముందే కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని, తన అఫిషియల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి డిలీట్ చేసిందంటూ ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని మోడీకి చెందిన 'నమో'యాప్‌పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన యాప్‌ను ముందుగానే డిలీట్ చేసిందని బీజేపీ పార్టీ ఐటీ విభాగం ఆరోపించింది. అయితే తాము సభ్యత్వాన్ని యాప్ ద్వారా చేయమని, కేవలం వెబ్‌సైట్ ద్వారా మాత్రమే నమోదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తమ యాప్‌లతో యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి యూజర్ల వివరాలను సదరు యాప్‌ల నుంచి తస్కరించి ఎవరికి అందజేస్తున్నారో తేలాల్సి ఉంది.

English summary
Continuing its attack on the Congress over data breach allegations, the Bharatiya Janata Party on Monday claimed that the Congress has deleted its Android application from Google’s Play Store. “Rahul Gandhi gave a call to #DeleteNaMoApp, but Congress deleted its own App from the App store after they were called out. What is the Congress party hiding?,” said Amit Malviya, Bharatiya Janata Party’s IT cell chief. He also shared some screenshots to validate his claims. The alleged deletion of App came hours after Malviya hit back at Congress president Rahul Gandhi over his claims that the Prime Minister’s Narendra Modi app was leaking data to a US firm. Malviya had pointed that that the Congress app mentions sharing people’s data with a number of third-party organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X