వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెడ్డీ ఎఫెక్ట్: కర్ణాటక మోడల్ వర్తింపజేయాలి, ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తాజా ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ వ్యవహరించిన తీరుతో ఇతర రాష్ట్రాల్లో కూడ ఇదే పద్దతిలో తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల గవర్నర్లను కలవనున్నారు.

Recommended Video

కర్ణాటక బల పరీక్ష...యడ్యూరప్ప నేగ్గేనా???

కర్ణాటక రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయపార్టీగా అవతరించిన పార్టీగా ఉన్న బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ అవకాశం కల్పించారు. అయితే 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో అనుసరించిన పద్దతినే అనుసరించకుండా కర్ణాటకలో గవర్నర్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు.

అయితే కర్ణాటకలో గవర్నర్ అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందున తమ రాష్ట్రాల్లో కూడ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గోవా, మణిపూర్ ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల గవర్నర్లను కలవనున్నారు.

గోవాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్

గోవాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్

గతంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి. గోవా రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 17 ఎమ్మెల్యేలను కైవసం చేసుకొంది. బిజెపికి 13 స్థానాలు మాత్రమే దక్కాయి. అయితే బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే బిజెపిలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 16కు తగ్గింది. బిజెపి బలం 14కు పెరిగింది. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించారు. దీంతో గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణం చేశారు. కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా ఉన్న తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్ పై గవర్నర్ ను కలిసే అవకాశం లేకపోలేదు.

మణిపూర్ లో అధికారానికి కాంగ్రెస్ దూరం

మణిపూర్ లో అధికారానికి కాంగ్రెస్ దూరం

మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరిగాయి. మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. మణిపూర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లు దక్కాయి. బిజెపి 21 సీట్లు కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్, లోక్ జనశక్తి పార్గీతో చేతులు కలిప బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగినట్టుగానే మణిపూర్ లో కూడ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో భాజపాకు అవకాశం ఇచ్చినట్లు ఇక్కడ మాకెందుకు అవకాశం ఇవ్వరు' అని మణిపూర్‌ మాజీ సీఎం ఓఐ సింగ్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

మేఘాలయలో కాంగ్రెస్ ఎత్తుగడ

మేఘాలయలో కాంగ్రెస్ ఎత్తుగడ

మేఘాలయ రాష్ట్రంలో కూడ కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మేఘాలయ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలను దక్కించుకొంది. బిజెపి ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపి కేవలం 19 స్థానాల్లోనే విజయం సాధించింది. మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా ఆ రాష్ట్ర గవర్నర్ ను కలవాలని భావిస్తున్నారు. కర్ణాటక పరిణామాలతో తమకు అనుకూలంగా మేఘాలయ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు

కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు

కర్ణాటకలో పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో బిజెపికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అయితే ఇతర రాష్ట్రాల గవర్నర్ల వద్ద కాంగ్రెస్ నేతలు ఈ విషయమై పెద్ద ఎత్తున డిమాండ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడ రాజకీయంగా వేడి రాజుకొనే అవకాశాలు లేకపోలేదు.

English summary
Stung by the developments in Karnataka, the Congress is preparing to make a point in other states where it missed a shot at power after falling short of numbers - Goa, Manipur and Meghalaya. Its ally in Bihar, Lalu Yadav's party RJD, has the same idea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X