వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఖరికి దాన్ని కూడా వదల్లేదు... కాంగ్రెస్‌పై బీజేపీ మరో సంచలన ఆరోపణ...

|
Google Oneindia TeluguNews

చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిట్టికొట్టేందుకు బీజేపీ వరుస అస్త్రాలను ప్రయోగిస్తోంది. నిన్నటికి నిన్న చైనా ఎంబసీ ద్వారా కాంగ్రెస్ విరాళాలు స్వీకరించిందని ఆరోపించిన బీజేపీ... తాజాగా మరో సంచలన ఆరోపణ చేసింది. మన్మోహన్ సింగ్ హయాంలో పీఎం రిలీఫ్ ఫండ్ నిధులను రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన ట్విట్టర్‌లో పలు డాక్యుమెంట్స్‌ను పోస్టు చేశారు.

ఆఖరికి దాన్ని కూడా వదల్లేదని...

మన్మోహన్ సింగ్ హయాంలో సోనియా గాంధీ నేత్రుత్వంలోని రాజీవ్ ఫౌండేషన్‌కు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు మళ్లించారని జేపీ నడ్డా ఆరోపించారు. 'పీఎంఎన్ఆర్ఎఫ్ అనేది ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన నిధి. కానీ యూపీఏ హయాంలో ఆ నిధి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు మళ్లింది. రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్ ఎవరు... శ్రీమతి సోనియా గాంధీ..' అంటూ నడ్డా తన ట్వీట్‌లో ఆరోపణలు చేశారు.

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని...

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని...


దేశ ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కష్టాల్లో ఉన్న తమ తోటి ప్రజలను ఆదుకునేందుకు పీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తారని... అలాంటి ప్రజా ధనాన్ని ఒక కుటుంబం నడిపే ఫౌండేషన్‌కు మళ్లించడమేంటని ప్రశ్నించారు. ఇది మోసం మాత్రమే కాదని దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆరోపించారు. చైనాకు లొంగిపోయిందని ప్రధాని మోదీ కాదని... మన్మోహన్ హయాంలో కాంగ్రెస్ పార్టీయే చైనాకు లొంగిపోయి దోషిగా నిలబడిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

చైనాతో వాణిజ్య ఒప్పందం..?

చైనాతో వాణిజ్య ఒప్పందం..?


'2007లో కాంగ్రెస్ చైనాతో ప్రాంతీయ వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నించింది. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ చైనాకు వ్యతిరేకం..? 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చైనీస్ ప్రీమియర్ వెన్ జియాబావోలకు రీజినల్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై ప్రజెంటేషన్ కూడా ఇవ్వబడింది. అప్పటి వాణిజ్య శాఖ మంత్రి కమల్‌నాథ్ రీజినల్ ట్రేడ్ అగ్రిమెంట్‌ను హై లెవల్ బాడీ అయిన ట్రేడ్ & ఎకనమిక్ రిలేషన్స్ కమిటీ(TERC)కి ప్రతిపాదించారు.' అని నడ్డా బయటపెట్టిన డాక్యుమెంట్స్‌లో పేర్కొని ఉంది.'మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని వాణిజ్య సంస్థ 2012 లో ఇలా పేర్కొంది.. చైనాతో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యానికి దూరంగా ఉండటం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు' అని ఆ డాక్యుమెంట్స్‌లో ఆరోపించారు.

బడ్జెట్ డాక్యుమెంట్‌లో.. రాజీవ్ ఫౌండేషన్ నిధులు...

బడ్జెట్ డాక్యుమెంట్‌లో.. రాజీవ్ ఫౌండేషన్ నిధులు...

కాంగ్రెస్‌పై నడ్డా మరో బలమైన ఆరోపణ కూడా చేశారు. 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఉన్నప్పటి బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్‌లోని విషయాలను ప్రస్తావించారు. అప్పటి స్పీచ్‌కి సంబంధించిన డాక్యుమెంట్‌లోని 16వ పేజీలో 57వ పారాగ్రాఫ్‌లో.. రాజీవ్ ఫౌండేషన్‌కు ఏడాదికి రూ.20కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు రూ.100 కోట్లు ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. బీజేపీ,జేపీ నడ్డా చేస్తున్న ఆరోపణలన్నీ చైనా దురాక్రమణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనని పేర్కొంది.

Recommended Video

Watch : Jyotiraditya Scindia Joins BJP, Entire Scindia Family With BJP Now
తోసిపుచ్చిన కాంగ్రెస్...

తోసిపుచ్చిన కాంగ్రెస్...


'బీజేపి, ప్రధాని నరేంద్రమోదీ దేశం పట్ల పెద్ద దుశ్చర్యకు పాల్పడుతున్నారు. చైనాతో పోరాడటానికి,దేశాన్ని రక్షించడానికి బదులుగా, వారు కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీస్తున్నారు.'అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. గురువారం(జూన్ 25) కూడా బీజేపీ కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చైనా ఎంబసీ నుంచి రాజీవ్ ఫౌండేషన్‌కు విరాళాలు స్వీకరించి... చైనాకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ మాత్రం అదంతా పారదర్శకంగా జరిగిన వ్యవహారమేనని స్పష్టం చేసింది.

English summary
BJP president JP Nadda, in a tweet this morning, released documents that he said showed that during the Manmohan Singh era, money from the Prime Minister's relief fund was diverted and donated to the Rajiv Gandhi foundation. Sonia Gandhi is chief of the foundation and the board includes Rahul Gandhi, Priyanka Gandhi Vadra, P Chidambaram and Manmohan Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X