వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జేడీఎస్-కాంగ్రెస్ మధ్య కుదిరిన డీల్ ఇదీ, ఆ విషయాలు బయటపెట్టకూడదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అసెంబ్లీలో బలనిరూపణకు తమకు ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువగా ఉన్నారని కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. యడ్యూరప్ప గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఓడించిందనే విషయం రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీకి 78 వస్తే మాకు 104 వచ్చాయన్నారు. స్వయంగా సిద్ధరామయ్య ఓచోట ఓడిపోయి, మరోచోట బొటాబోటి మెజార్టీతో గెలిచారన్నారు. నకిలీ ఓటరు కార్డులు, తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్, జేడీఎస్ మోసగించాయని చెప్పారు. కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు.

Congress does not respect institutions & this statement is just an evidence of that: Prakash Javadekar

అవినీతి ఆరోపణలు తిరగదోడకుండా ఆ రెండు పార్టీలు డీల్ కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న అసలు డీల్ ఇదే అన్నారు. కాంగ్రెస్ అవినీతిని బయటపెట్టకూడదని జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అన్నారు.

పార్లమెంటును అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రెస్ సెన్సార్‌షిప్ తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ హయాంలో కోల్ స్కాం, 2జీ ఇలా ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయన్నారు. మోడీ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. వ్యవస్థలను గౌరవించంది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.

English summary
Congress does not respect institutions & this statement is just an evidence of that. Is this how they show respect towards the post of the Governor?: Union Minister Prakash Javadekar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X