తేజస్వి యాదవ్ కుర్తా పట్టుకుని వేలాడినా ... విజయం ఎన్డీఏదే... కాంగ్రెస్ కు పీఎం మోడీ చురకలు
మూడు దశల బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు . మంగళవారం రెండు ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్న ఆయన ముస్లింల కోట అయిన సీమాంచల్లోని ఫోర్బెస్గంజ్ వద్ద, మరొకటి యాదవుల బలమైన కోట కోడిలోని సహర్సా వద్ద ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు . అరేరియాలోని ఫోర్బెస్గంజ్లోని హవాయి అడ్డా గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు, సహార్సాలోని పటేల్ గ్రౌండ్లో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మాట్లాడారు .
Bihar elections..నవంబర్ 10 తర్వాత నితీష్ కుమార్ బీహార్ సీఎం అయ్యే ఛాన్స్ లేదు:చిరాగ్ పాశ్వాన్

మళ్ళీ బీహార్ లో అధికారం ఎన్డీయేదే .. మోడీ
ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ను తిరిగి ఎన్నుకోవటానికి బీహార్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు . ప్రధాని నరేంద్ర మోడీ మూడు దశలలో బీహార్ రాష్ట్ర ఎన్నికలలో రెండవ దశ 94 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది, మనకు లభిస్తున్న ప్రాధమిక సమాచారం ఆధారంగా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని రాష్ట్రం నిర్ణయించింది అని ప్రధాని బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో పోల్ ర్యాలీలో ప్రసంగించారు.

2021 నుండి 2030 మధ్యకాలం బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన సమయం
బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. గత దశాబ్దంలో మౌలికసదుపాయాల మెరుగుదలకు నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేసిందని, ఇప్పుడిక తమ కూటమి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని మోడీ ఎన్నికల సభలో పేర్కొన్నారు. 2021 నుండి 2030 మధ్యకాలం బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన సమయమని ప్రధాని పేర్కొన్నారు
బీహార్ రాష్ట్రంలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చి తమ స్టేట్ ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తుందని మోడీ చెప్పారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరింత వేగంగా అభివృద్ధి
ఇప్పుడు బీజేపీతో కలిసి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరింత వేగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని మోడీ పేర్కొన్నారు. మోడీకి ప్రజలు ఆశీస్సులు అందించారని , ఆయన తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని భావిస్తున్నారు అని తనకు తానే చెప్పుకున్నారు. రాజకీయాల్లో పక్షపాత ధోరణికి ఓటమి ఎదురవుతుందని, ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ కు కనీసం పార్లమెంట్ లో 100 మంది ఎంపీలు కూడా లేరు
ఆర్జెడి కాంగ్రెస్ వామపక్షాల కూటమిపై విరుచుకుపడుతూ కాంగ్రెస్ కు లోక్సభ , రాజ్యసభలో కనీసం వంద మంది ఎంపీలు కూడా లేరన్నారు. ప్రజలు ఆ పార్టీని అవకాశం వచ్చినప్పుడల్లా శిక్షిస్తున్నారని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, జాతీయ పార్టీకి ఈ రోజు పార్లమెంటులో 100 మంది ఎంపీలు కూడా లేరని పిఎం మోడీ అన్నారు. మొదటి దశ, రెండవ దశ యొక్క ప్రాధమిక నివేదికల ప్రకారం, బీహార్లో మరోమారు ఎన్డిఎ సర్కార్ అని బీహార్ ప్రజలు తీర్పు ఇస్తున్నారని స్పష్టమయ్యిందని పిఎం మోడీ అన్నారు.

తేజస్వి యాదవ్ కుర్తా పట్టుకుని వేలాడుతున్నారు
కాంగ్రెస్ సభ్యుడిని తమ రాష్ట్రం నుండి ఎంపీగా మార్చడానికి కూడా ప్రజలు అనుమతించని రాష్ట్రాలు ఉన్నాయన్నారు . జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చాలా రాష్ట్రాలు ఉన్నాయి అని మోడీ పేర్కొన్నారు . ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రకారం కాంగ్రెస్ మూడవ, నాల్గవ, ఐదవ స్థానాల్లో ఉందని మోడీ తెలిపారు.ఇప్పుడు వారు అధికారంలోకి రావడానికి ఒకరి కుర్తాను పట్టుకొని వేలాడుతున్నారు అని ఆర్జెడి చీఫ్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్ ను ప్రస్తావిస్తూ మోడీ సెటైర్లు వేశారు .

ఎన్డీయే కు అనుకూలంగానే బీహారీల తీర్పు .. మోడీ ధీమా
బీహార్ ప్రజలు జంగిల్ రాజ్ మరియు డబుల్ యువరాజ్ ను వెంటనే తిరస్కరించారు, అని మోడీ తన ఎన్నికల ర్యాలీలో అన్నారు.ప్రజా తీర్పు ఎన్డీయేకు అనుకూలంగా ఉంటుందని ఆయన మరోమారు స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా బీహార్ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి వస్తున్నారని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య శక్తి అని , ప్రతి బీహార్ వ్యక్తి ఎన్నికల పట్ల అంకితభావం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.