వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా గాంధీ సంచలన నిర్ణయం - కాంగ్రెస్ పదవుల నుంచి ఆజాద్, ఖర్గే సహా కీలక నేతలు తొలగింపు

|
Google Oneindia TeluguNews

జాతీయ కాంగ్రెస్ పార్టీలో కనీవినీ ఎరుగని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అదిష్టానం తీరును సవాలు చేస్తూ ఘాటు లేఖ రాసిన గులాం నబీ ఆజాద్ సహా పలువురు కీలక సీనియర్ నేతలను పదవుల నుంచి తప్పించారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అయితే, జనరల్ సెక్రటరీలుగా తొలగించిన నేతలను మరో కీలక కమిటీల్లోకి తీసుకోవడం గమనార్హం.

 చైనా బోర్డర్‌లో టెన్షన్: ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ - డిఫెన్స్ రివ్యూపై బ్రీఫింగ్ చైనా బోర్డర్‌లో టెన్షన్: ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ - డిఫెన్స్ రివ్యూపై బ్రీఫింగ్

ఇన్నాళ్లూ కాంగ్రస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగిన గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోరా, లుజిన్హో ఫలేరియో, అంబికా సోనిలను పదవుల నుంచి తప్పిస్తూ శుక్రవారం రాత్రి ఆదేశాలు వెలువడ్డాయి. కాగా, ఆజాద్, అంబికా సోనిలు వర్కింగ్ కమిటీలో సభ్యులుగా మాత్రం కొనసాగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్ చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్

 Congress drops Azad, , Kharge, Soni and other key leaders as general secretaries

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నికతోపాటు సంస్థాగతంగా ప్రక్షాళన అవసరమంటూ 23 మంది సీనియర్లు సోనియా గాంధీకి రాసిన లేఖపై పెద్ద దుమారం చెలరేగడం తెలిసిందే. ఆరు నెలల్లోగా కొత్త చీఫ్, ప్రక్షాళన ప్రక్రియ చేపడతామమని ఏఐసీసీ అధికార ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. ఆ ప్రక్రియలో భాగంగానే అధినేత్రి సోనియా ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

English summary
In a major organisational reshuffle, the congress on Friday reconstituted the party's working committee and dropped senior leaders Ghulam Nabi Azad, Motilal Vora, Ambika Soni, Mallikarjun Kharge and Luizinho Falerio from their posts as general secretaries. Azad and Soni, however, continue in the reconstituted working committee. Azad was among 23 leaders who had written a letter to party chief Sonia Gandhi calling for a complete overhaul of the organisation, a full-time president and elections to Congress Working Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X