వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

35ఏళ్ల పరిచయం: ఆమెతోనే 60ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత పెళ్లి: నేతల అభినందనలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ 60ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన పాత స్నేహితురాలు రవీనా ఖురానాను ఆయన వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో వీరిద్దరికి వివాహం జరిగింది.

60ఏళ్ల వయస్సులో పెళ్లి..

60ఏళ్ల వయస్సులో పెళ్లి..

ముకుల్ వాస్నిక్-రవీనా ఖురానాల వివాహ వేడుకకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ హాజరయ్యారు. అత్యంత సన్నిహితులు మధ్యే వీరి వివాహం జరిగింది. కాగా, ముకుల్ వాస్నిక్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.

1984 నుంచి రవీనాతో పరిచయం..

1984 నుంచి రవీనాతో పరిచయం..

కానీ, 1984 నుంచి పరిచయం ఉన్న రవీనా ఖురానాను వివాహం చేసుకోవడం విశేషం. ముకుల్ వాస్నిక్ గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాగా, ప్రస్తుతం ముకుల్ వాస్నిక్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రవీనా న్యాయవాది, వ్యాపారవేత్త..

రవీనా న్యాయవాది, వ్యాపారవేత్త..

వివాహ బంధంతో ఓ ఇంటివారైన ముకుల్ వాస్నిక్‌కు కాంగ్రెస్ నేతలు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, రవీనా ఖురానా ఢిల్లీలో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. అంతేగాక, పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు.

సుఖసంతోషాలతో... నేతల శుభాకాంక్షలు...

‘మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు అభినందనలు. రానున్న రోజులు మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలను కోరుకుంటున్నా' ముకులు-రవీనా పెళ్లిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘ముకుల్ వాస్నిక్-రవీనా ఖురానా పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను 1984లో ముకుల్‌ను, 1985లో రవీనాను మొదటిసారి కలిశాను. వారిద్దరు పెళ్లి చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. మేమంతా కలిసి గతంలో మాస్కోలో జరిగిన వరల్డ్ యూత్ స్టూడెంట్ ఫెస్టివల్ కు హాజరయ్యాం' అంటూ మాజీ కేంద్రమంత్రి మనీష్ తివారీ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు.

English summary
Congress general secretary and former Union Minister Mukul Wasnik married his old friend Raveena Khurana at a private function in a five-star hotel where several senior Congress leaders were in attendance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X