కులం, ప్రాంతం, కాంగ్రెస్ కర్ణాటక మంత్రి పదవులు, రామలింగా రెడ్డికి నో చాన్స్, అసమ్మతి!
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బుధవారం మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యడానికి సర్వం సిద్దం చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మంత్రి పదవులు అప్పగించడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాంతాలు, కులాల లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మంత్రి పదవులు కేటాయించింది. సిద్దరామయ్య ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా పని చేసిన రామలింగా రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు.

18 మందికి అవకాశం
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు కేటాయించడానికి ఇరు పార్టీల నాయకులు అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ 18 మందికి మాత్రమే మంత్రి పదవులు అప్పగించాలని నిర్ణయించింది.

మంత్రి పదవులు
కర్ణాటక కరావళి (కోస్తా), ఉత్తర కర్ణాటక, పాత మైసూరు, బెంగళూరు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మంత్రి పదవులు కేటాయించింది. అన్ని కులాలను సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేసింది.

ఏ కులానికి ఎన్ని పదవులు
లింగాయుత కులానికి నాలుగు పదవులు, ముస్లీంలకు రెండు పదవులు, ఒక్కలిగ కులానికి రెండు పదవులు, దళితులకు నాలుగు పదవులు, కురబ, ఉప్పార, ఈడిగ, రెడ్డి కులాలకు ఒక్కొక్క పదవి కేటాయించారు. బెంగళూరు నగర ఎమ్మెల్యేలకు మూడు మంత్రి పదవులు కేటాయించారు.

గొడ మీద దీపం
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేలకు ఇంత వరకూ వారి శాఖలు ఏమిటి అనే విషయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బహిరంగంగా ప్రకటించలేదు. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవంకు తూట్లు పడటంతో మళ్లీ ఆ ప్రాంతాల్లో పుంజుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకాకు 7 మంత్రి పదవులు కేటాయించారు.

కాంగ్రెస్ మంత్రులు
బ్యాటరాయణపుర (బెంగళూరు)- కృష్ణభైరే గౌడ- ఒక్కలిగ
చామరాజపేట (బెంగళూరు)- జమీర్ అహమ్మద్- ముస్లీం
బెంగళూరు- కేజే జార్జ్- క్రిష్టియన్
హుమనాబాద్- రాజశేఖర్ పాటిల్- లింగాయుత
మంగళూరు-యూటీ ఖాదర్- మస్లీం
విజయపుర- శివానంద పాటిల్- లింగాయుత
గౌరిబిదనూరు- శివశంకర్ రెడ్డి- రెడ్డి
హావేరి- శంకర్- కురబ
కనకపుర- డీకే. శివకుమార్- ఒక్కలిగ
గదగ్- హెచ్.కే. పాటిల్- లింగాయుత
హళియాళ-ఆర్.వీ. దేశ్ పాండ్- బ్రాహ్మాణ
శామనూరు శివశంకరప్ప- లింగాయుత
చామరాజనగర- పుట్టరంగశెట్టి- ఉప్పార
ఎమ్మెల్సీ- జయమాల- ఈడిగ
చిత్తాపుర-ప్రియాంక్ ఖార్గే- దళిత
యమకనమరడి-సతీష్ జారకిహోళి- నాయక్ (దళిత)
బళ్లారి- తుకారాం- నాయక్ (ఎస్టీ)
పావగడ-వెంకటరమణప్ప-భోవి (దళిత)