వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షెడ్యూల్ 10 ఏం చెబుతోంది..? 1986 చట్టంలో ఏముంది..? రెబెల్స్‌పై వేటుతప్పదా.. !!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : రెబల్ ఎమ్మెల్యేల వల్లే కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కూలిపోయింది. విశ్వాస పరీక్షకు నాలుగు సీట్ల దూరంలో నిలిచింది. దీంతో తిరుగుబాటు ఎగరేసిన రెబెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని జేడీయూ, కాంగ్రెస్ వర్గాలు స్పష్టంచేశాయి. వారిపై అనర్హత వేటు తప్పదని తేల్చిచెప్పాయి. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు కారణమైన ఎమ్మెల్యేలు భవిష్యత్‌లో కూడా పోటీ చేయకుండా చర్యలు తీసుకునేలా జేడీయూ, కాంగ్రెస్ పార్టీలో భావిస్తున్నాయి.

సంకీర్ణ ప్రభుత్వ తీరును నిరసిస్తూ 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరేసిన సంగతి తెలిసిందే. 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యులు రాజీనామా చేసి .. ముంబై హోటళ్లలో మకాం వేశారు. వీరిని తమ దారిలోకి తీసుకొచ్చేందుకు సంకీర్ణ ప్రభుత్వం శతవిధలా ప్రయత్నించింది. అయితే చర్చలు సఫలీకృతం కాలేదు. మధ్యలో సుప్రీంకోర్టు కల్పించుకోవడంతో ఎట్టకేలకు మంగళవారం బలపరీక్ష నిర్వహించారు. అయితే నిన్న సభకు 205 మంది సభ్యులు హాజరయ్యారు. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైలో ఉండగా .. ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు అనారోగ్యంతో సభకు హాజరుకాలేదు. మరోవైపు ఇండిపెండెట్ సభ్యుడు ఒకరు, బీఎస్పీ సభ్యుడు కూడా సభకు రాలేదు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 103 సభ్యులు కాగా .. సంకీర్ణ ప్రభుత్వానికి 99 సభ్యుల మాత్రమే వచ్చింది. దీంతో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది.

Congress, HD Kumaraswamy Promise Strong Action Against Rebels

ప్రభుత్వం కూలిపోయేందుకు కారణమైన సభ్యులపై అనర్హత వేటు వేస్తామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య తేల్చిచెప్పారు. ఇలాంటి వారిని ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ఆపరేషన్ కమలానికి ఆకర్షితులైన నేతలపై చర్యలు తప్పదని హెచ్చరించారు. షెడ్యూల్ 10 ప్రకారం ఆ సభ్యులపై అనర్హత వేటు వేస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు అధికార పార్టీ సభ్యులు ప్రభుత్వానికి ఓటేయాలని డీకే శివకుమార్ విప్ జారీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినా వారు తమ ఆదేశాలను బేఖాతరు చేశారని గుర్తుచేశారు.

రాజీనామాలపై వాదనలు వినిపించాలని స్పీకర్ కోరినా .. 4 వారాల సమయాన్ని రెబల్ ఎమ్మెల్యేలు అడిగిన సంగతి తెలిసిందే. అయితే 1986 అనర్హత చట్టం నిబంధనల ప్రకారం సభ కొనసాగే సమయంలో వారం రోజుల్లో హాజరుకాకుంటే అనర్హత వేటు పడుతుందని గుర్తుచేశారు. ఈ విషయాన్ని తాము స్పీకర్‌కు గుర్తుచేశాయని తెలిపారు. తమ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు, రూ.30 కోట్లు, రూ.50 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని సిద్ధరామయ్య విమర్శించారు.

English summary
The Congress and HD Kumaraswamy, whose government in Karnataka crashed in the test of strength in the state assembly on Tuesday, have promised strong action against the rebels who brought it down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X