వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్షన్ పడుతుంటే సిద్దరామయ్య టూరు, కాంగ్రెస్ హైకమాండ్ అసహనం, సహజం, సిద్దూ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్న సమయంలో అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పర్యటనల్లో నిమగ్నం కావడం ఏమిటని ఆ పార్టీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసిందని తెలిసింది. అయితే ఇలాంటివి సహజం అంటూ సిద్దరామయ్య అంటున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

మంత్రి పదవులు దక్కలేదని మాజీ మంత్రులు ఎంబి. పాటిల్, హెచ్ కే. పాటిల్, సతీష్ జారకిహోళి, హెచ్ఎం. రేవణ్ణ, రోషన్ బేగ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, ఎంటీబీ నాగరాజు, బిసి, పాటిల్, హ్యారిస్ తదితరులు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద తిరుగుబాటు చేశారు.

Congress highcommand upset over Siddaramaiahs Badami tour in Karnataka

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనను శాసన సభ ఎన్నికల్లో గెలిపించిన బాదామి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆ నియోజక వర్గంలో గత మూడురోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఎంబి. పాటిల్ సైతం ఎవ్వరిమాట వినకుండా కాంగ్రెస్ హైకమాండ్ మీద తిరుగుబాటు చేశారు.

బాదామి నియోజక వర్గం నుంచి వెంటనే బెంగళూరు చేరుకుని అసమ్మతి నాయకులను బుజ్జగించాని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కేపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ మాజీ సీఎం సిద్దరామయ్యకు సూచించారని తెలిసింది.

సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు పంపకంలో ఇంటి సమస్యలు సహజంగా వస్తాయని, 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురైనాయని, తాను బాదామి పర్యటన ముందుగానే నిర్ణయించానని సీఎం సిద్దరామయ్య అంటున్నారని తెలిసింది.

English summary
Congress highcommand upset over Siddaramaiah for touring Badami constituency while the parties senior leaders are fighting for ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X