• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిషన్ శక్తి క్రెడిట్ ఎవరిది ? బిజేపి or కాంగ్రెస్ సైంటీస్టులను అవమానిస్తున్నారు

|

ప్రధానమంత్రి నరేంద్ర మోడి మిషన్ శక్తి పై ప్రకటన చేసిన తర్వాత రాజకీయ వాతవరణం వేడెక్కింది, మిషన్ శక్తి , క్రెడిట్ ను స్వంతం చేసుకునేందుకు బిజేపి ,కాంగ్రెస్ పార్టీలు పోటి పడుతున్నాయి.దీంతో ఓకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్నారు.

 స్పెస్ క్లబ్ లో చేరిన ఇండియా ; మోదీ

స్పెస్ క్లబ్ లో చేరిన ఇండియా ; మోదీ

స్పేస్ శక్తిలో అంత్యంత్య శక్తివంతమైన మూడు దేశాల తర్వాత నాల్గవ దేశంగా భారత్ చేరిందని ప్రధాని నరేంద్రమోడి ప్రకటించారు. డిఆర్‌డీఏ శాస్త్రవేత్తలు సాధించిన విజయంపై ఆయన ప్రశంశల వర్షం కురిపించారు. దీంతో అటు చైనాకు ఇటు ప్రత్యర్థి దేశాలకు భారత్ సత్తా చాటారని మోది చెప్పారు.ఇది బిజేపి హయాంలో సాధించిన విజయంగా మోదీ చెప్పకపోయినా, ఎన్నికల సమయంలో మోది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన స్వయంగా ప్రకటించారు.అంతకు ముందు ఈ విషయాన్ని ప్రకటించడం కోసం మోడి మరో అర్ధగంటలో మీడీయాతో ముఖ్యమైన విషయం పై మాట్లాడతారని ట్వీట్ పెట్టడడంతో, మీడియా సంస్థలతో పాటు ప్రజలు అంత్యంత అసక్తిగా ఎదురు చూశారు,

కౌంటర్ అటాక్ రాహుల్

కౌంటర్ అటాక్ రాహుల్

అయితే భారత అంతరిక్ష శాటిలైట్ తయారి వ్యవస్థ1962 లోనే నేహ్రు హయాంలో ప్రారంభమైందని ,ఇది కాంగ్రెస్ క్రెడిట్ అని కాంగ్రెస్ నేతలు పేర్కోన్నారు.దీంతో శాటిలైన్ తయారిలో బీజేపి క్రెడిడ్ ఏది లేదంటూ పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధి డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను అభినందిస్తూనే మరోవైపు మోడిని పై సెటైర్లు వేశారు..ఈ సంధర్భంలోనే మోడికి ప్రపంచ నాటక రంగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో పేర్కోన్నారు,ఈ నేఫథ్యంలోనే బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కూడ మిషన్ శక్తిపై మోడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ సీరియస్

బీజేపీ సీరియస్

మోడిని నాటకకర్తగా పేర్కోంటు చేసిన ట్వీట్ బిజేపి సీరియస్ గా తీసుకుంది,దీంతో ఆపార్టీ చీఫ్ అమిత్ షా రాహుల్ గాంధిపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధి అటు సైనికులను ,శాస్త్రవేత్తలను అవమానిస్తున్నడని అన్నారు. రాహుల్ గాంధి రాజరిక పోకడలకు పోతున్నారని అన్నారు,రాజరిక పోకడలతోనే దేశాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. దీంతోపాటు తమ జీవీతాలను ఫణంగా పెడుతున్న సైనికులను ,అదే విధంగా శాస్త్రవేత్తలను సైతం కూడ అవమానిస్తున్నారని అన్నారు.ఇక ఆర్ధిక మంత్రి ఆరుణ్ జైట్లి కూడ దీనిపై స్పందించారు, సైంటిస్టుల స్వంత శక్తిని శంకించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లడడం విడ్డురంగా ఉందని విమర్శించారు.2012 లో యాంటీ శాటిలైట్ తయారికి డీఆర్‌డీవో సిద్దంగా ఉన్నా, ప్రభుత్వం అనుమతించలేదని డీఆర్‌డీవో చీఫ్ వీకే సరస్వత్ చెప్పారని అన్నారు.

మొత్తం మీద రెండు పార్టీలు ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు పై సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు దీంతో రెండు పార్టీల్లో యుద్ద వాతవరణ నెలకోంది.

English summary
after Prime Minister Narendra Modi announced that Indian scientists have successfully demonstrated anti-satellite missile capability by shooting down a live satellite,politics was at play soon after the announcement with the Congress and BJP taking credit for the feat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X