వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"కుష్భూతో కాంగ్రెస్ సర్వనాశనం" (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

చెన్నై: టీఎన్ సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మహిళా ద్వేషి అంటూ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు విజయధరణి ధ్వజమెత్తారు. డీఎంకే కుటుంబంలో లేనిపోని సమస్యలు సృష్టించి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన కుష్భూ ఇప్పుడు ఇక్కడా అలాంటి చిచ్చు పెడుతున్నదని విరుచుకుపడ్డారు.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన తరువాత తన భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని విజయధరణి చెప్పారు. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు (తమిళనాడు) పదవి నుంచి ఇటీవల విజయధరణిని తప్పించిన విషయం తెలిసిందే.

ఆమె స్థానంలో ఝాన్సీరాణిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపధ్యంలో విజయధరణి సొంత పార్టీ నాయకుల మీద మండిపడ్డారు. అయితే తాను శాసన సభ్యురాలి పదవికి రాజీనామా చెయ్యలేదని విజయధరణి అన్నారు.

కుష్భూ ఎప్పుడూ చిచ్చు పెడుతూనే ఉంటుంది

కుష్భూ ఎప్పుడూ చిచ్చు పెడుతూనే ఉంటుంది

డీఎంకేలో ఉన్నసమయంలో ఆ కుటుంబంలో సమస్యలు సృష్టించిన నటి కుష్భూ తరువాత బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిందని విజయధరణి గుర్తు చేశారు. ఇప్పడు కాంగ్రెస్ లో సమస్యలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు.

అన్నా డీఎంకేలో చేరుతారని వార్తలు

అన్నా డీఎంకేలో చేరుతారని వార్తలు

విజయధరణి అన్నాడీఎంకే పార్టీలో చేరడానికి సిద్దం అవుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తర్వాత నిర్ణయం తీసుకుంటా

తర్వాత నిర్ణయం తీసుకుంటా

రాహుల్ గాంధీని కలిసిన తరువాత తాను భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని, కార్యకర్తలతో సంప్రధించాలని ఎంఎల్ఏ విజయధరణి స్పష్టం చేశారు.

మహిళా ద్రోహి ఇళంగోవన్

మహిళా ద్రోహి ఇళంగోవన్

విజయధరణి మీడియాతో మాట్లాడుతూ టీఎన్ సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కాంగ్రెస్ మహిళా విభాగాన్ని అణగదొక్కుతున్నారని, అందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భూ వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరితోనూ అంతే

అందరితోనూ అంతే

తనతోనే కాదని మహిళలమీద ఇళంగోవన్ ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారని గుర్తు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ మహిళలకు ఇబ్బందులు

కాంగ్రెస్ మహిళలకు ఇబ్బందులు

ఇలాంటి ఇళంగోవన్ వలన కాంగ్రెస్ లోని మహిళలు చాల ఇబ్బందులకు గురౌతున్నారని విజయధరణి ఆరోపించారు.

కుష్భూనే కారణం

కుష్భూనే కారణం

తనకు పదవి దూరం కావడానికి నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భూనే కారణం అని విజయధరణి నేరుగా ఆరోపించారు.

జయలలిత అంటే ఇష్టం

జయలలిత అంటే ఇష్టం

జయలలిత అంటే తనకు గౌరవం, ఇష్టం అని విజయధరణి అన్నారు. అసెంబ్లీలో తాను సమస్యను ప్రస్తావించినప్పుడల్లా జయలలిత అభినందిచే విధంగా స్పందించారని విజయధరణి గుర్తు చేశారు.

అపాయింట్ మెంట్ అడిగాను

అపాయింట్ మెంట్ అడిగాను

తన నియోజక వర్గ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు జయలలిత దృష్టికి తీసుకెళ్లడానికి అపాయింట్ కోరినట్లు విజయధరణి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది

కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది

కుష్భూ కాంగ్రెస్ లో ఉంటే ఆపార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతింటుందని, ఆమె వల్లపార్టీకి నష్టమే కాని ఎలాంటి లాభం లేదని విజయధరణి ఆరోపించారు. కుష్భూ వలన కాంగ్రెస్ సర్వనాశనం అవుతుందని విజయధరణి జోస్యం చెప్పారు.

English summary
Vijayadharani said the party high command too had acted in an arbitrary manner by removing her from the post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X