వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్‌కు రాజ్యసభ కష్టాలు...!

|
Google Oneindia TeluguNews

మాజీ ప్రధాని ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే నేత స్టాలిన్ ఓప్పుకోకపోవడంతో ఆయన్ను రాజస్థాన్ నుండి ఎంపిక చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పావులు కదుపుతుంది. కాగా తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి..

మరోసారి మన్మోహన్ సింగ్ రాజ్యసభకు

మరోసారి మన్మోహన్ సింగ్ రాజ్యసభకు

పది సంవత్సరాల పాటు ప్రధాన మంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్‌కు రాజ్యసభ కష్టం వచ్చిపడింది..అధికారం కోల్పోయిన తర్వాత మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు..అయితే ప్రస్థుతం అస్సాం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు..కాగా ఆయన పదవి కాలం ఈనెల చివరి వరకు ఉండడంతో తిరిగి ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది..

మన్మోహన్‌కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిన డీఎంకే

మన్మోహన్‌కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిన డీఎంకే

ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఖాలీలుగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.దీంతో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ సపోర్ట్‌తో రాజ్యసభకు పంపాలని భావించింది..అయితే ఇందుకోసం డీఎంకే అధినేత స్టాలిన్ ముందుగా అంగీకరించినట్టు వార్తలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి అహ్మాద్ పటేల్ తోపాటు ,గులాం నభీ అజాద్ కూడ స్టాలిన్‌తో చర్చలు జరిపారు. కాని రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ నిరాకరించాడు.. దీంతో పాటు ఆపార్టీ సభ్యులను కూడ ప్రకటించేందుకు సిద్దమయింది.

రాజస్థాన్ నుండి రాజ్యసభకు మన్మోహన్

రాజస్థాన్ నుండి రాజ్యసభకు మన్మోహన్

దీంతో రాజస్థాన్ నుండి మన్మోహన్ సింగ్ ను రాజ్యసభకు పంపేందుకు సన్నహాలు చేస్తుంది.కాగా రాజస్థాన్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సాయిని కొద్ది రోజుల క్రితం మృతి చెందారు.దీంతో అక్కడ ఖాలి ఏర్పడింది.. దీంతో అక్కడ ఉప ఎన్నికలు జరగనన్నాయి. కాగా ఇటివల జరిగిన రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మన్మోహన్‌ను అక్కడి నుండి ఎంపిక చేయాలని నిర్ణయించింది..కాగా మదన్‌లాల్ పదవి కాలం ఎప్రిల్ 2024వరకు ఉండడంతో రాజస్థాన్‌ను ఎంపిక చేసింది కాంగ్రెస్.

English summary
Former Prime Minister Manmohan Singh's road to the Rajya Sabha has once again been re-routed after the Congress and its ally DMK failed to agree on a seat for him from Tamil Nadu. After Assam, Gujarat and Tamil Nadu, the Congress is now depending on Rajasthan for his renomination to parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X