వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ బీజేపీ, 22 ఎంపీ సీట్లు, జేడీఎస్ డిమాండ్ తో మీటింగ్, మా లక్షం అదే, సిద్దరామయ్య !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలకు లోక్ సభ సీట్ల పంపిణి విషయం పెద్ద సమస్య కాదని, బీజేపీని అధికారం నుంచి దూరం పెట్టడమే తన ముందున్న లక్షం అని మాజీ ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్దరామయ్య అన్నారు. వీలైనంత వరకు బీజేపీ అధికారంలోకి రాకుండా చూస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోస్యం చెప్పారు.

నాయకుల భేటీ

నాయకుల భేటీ

సోమవారం బెంగళూరు నగరంలోని కుమార కృప గెస్ట్ హౌస్ లో సిద్దరామయ్య అధ్వర్యయంలో సమన్వయ సమితి సభా సమావేశం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్. జీ. పరమేశ్వర్, సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్ డీ. రేవణ్ణ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జాతీయన నాయకుడు డ్యానిష్ ఆలీ, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకులు సమావేశం సమావేశంలో పాల్గోన్నారు.

ఎవరికి ఎన్ని సీట్లు ?

ఎవరికి ఎన్ని సీట్లు ?

2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చెయ్యాలని ఇంతకు ముందే నిర్ణయించాయి. అయితే లోక్ సభ సీట్ల పంపిణి విషయంలో కాంగ్రెస్ పార్టీ -జేడీఎస్ పార్టీల నాయకుల చర్చలు ఇంత వరకు కొలిక్కిరాలేదు. ఈ విషయంలో సోమవారం కుమార కృప గెస్ట్ హౌస్ లో ఇరు పార్టీల నాయకులు సుధీర్ఘంగా చర్చలు జరిపారు.

మాకు ఇన్ని సీట్లు కావాలి

మాకు ఇన్ని సీట్లు కావాలి

సోమవారం జరిగిన సమన్వయ సమితి సభా సమావేశంలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే విషయంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇంతకు ముందే తమకు 12 లోక్ సభ సీట్లు కేటాయించాలని జేడీఎస్ డిమాండ్ చేసింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇరు పార్టీల నాయకులు ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు.

సీట్ల పంపిణికి డెడ్ లైన్ !

సీట్ల పంపిణికి డెడ్ లైన్ !

సమన్వయ సమితి సభా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మొదటి విడత చర్చలు పూర్తి అయ్యాయని వివరించారు. అయితే ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, మరోసారి చర్చలు జరిగిపే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. జేడీఎస్ నాయకులు తమకు ఎన్ని సీట్లు కావాలి అనే జాబితా ఇచ్చారని సిద్దరామయ్య స్పష్టం చేశారు.

22 ఎంపీ స్థానాలు టార్గెట్ ?

22 ఎంపీ స్థానాలు టార్గెట్ ?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ రాజీనామా చేశారని తనకు తెలిసిందని సిద్దరామయ్య అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే స్వాతంత్రం ఉమేష్ జాదెవ్ కు ఉందని అన్నారు. అయితే ఉమేష్ జాదెవ్ రాజీనామాను స్పీకర్ రమేష్ కుమార్ ఇంకా అంగీకరించలేదని చెప్పారు. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేసి కనీసం 22 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

English summary
After coordination committee meeting Former Chief Minister Siddaramaiah said that, the second round of discussions for sharing of seats will be held soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X