వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక బలపరీక్ష: బెంగుళూరుకు చేరుకొన్న కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: బలపరీక్షకు హజరయ్యేందుకు హైద్రాబాద్ క్యాంపు నుండి మే 18వ తేది రాత్రి ప్రత్యేక బస్సుల్లో బయలు దేరిని కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు మే 19వ తేది ఉదయం బెంగుళూరుకు చేరుకొన్నారు.

కర్ణాటకలో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేల బృందం మే 18వ తేది ఉదయం పూట హైద్రాబాద్ కు చేరుకొంది. అయితే మే 19 వ తేదిన బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేల బృందం మే 18వ తేది రాత్రి హైద్రాబాద్ నుండి బయలుదేరారు.

Congress, JDS legislators reach, leave Hyderabad

కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించే సమయంలో అవలంభించాల్సిన విధానాలపై కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు వ్యూహలను రచించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశాన్ని నిర్వహించి సిద్దరామయ్యను సిఎల్పీ నేతగా ఎన్నుకొన్నారు.

బలపరీక్షలో యడ్యూరప్పను ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు సంయుక్తంగా పథకాన్నిరచించారు. ఆ తర్వాత రాత్రి పూట రోడ్డు మార్గం ద్వారా బెంగుళూరుకు బయలుదేరి వెళ్ళారు.

ఎమ్మెల్యేలకు భద్రతను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక బస్సులకు ముందు వెనుక పోలీసుల వాహనాలు అనుసరించాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడ కాంగ్రెస్ , జెడి(ఎస్) ఎమ్మెల్యేల వాహనాలను అనుసరించాయి. మే 19వ తేది ఉదంయ పూట బెంగుళూరులోని హోటల్ హిల్టన్ కు కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేల బృందం చేరుకొంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీకి హజరుకానున్నారు.

English summary
Congress and JDS MLAs from Karnataka, who arrived in Hyderabad to evade ‘BJP poaching’, had to rush back within hours after the Supreme Court ordered Yeddyurappa to complete the trust vote on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X