• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రమాణస్వీకారంపై 'స్టే' కుదరదన్న సుప్రీం, యడ్యూరప్పకు లైన్ క్లియర్

|

బెంగళూరు: మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తమను కాదని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వజుభాయ్ వాలా యడ్యూరప్పను ఆహ్వానినంచడంపై కాంగ్రెస్, జేడీఎస్ న్యాయపోరాటానికి సిద్దమయ్యాయి.ఈ మేరకు కాంగ్రెస్, జేడీఎస్ ల తరుపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు పిటిషన్ అందజేసిన సింఘ్వీ.. దీనిపై సత్వర విచారణ జరిపించాలని కోరారు.

yeddi

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వడంతో పాటు, బలనిరూపణకు ఇచ్చిన 15రోజుల గడువుపై కూడా స్టే ఇవ్వాలంటూ పిటిషన్ లో కాంగ్రెస్, జేడీఎస్ లు పేర్కొన్నాయి.

విచారణకు స్వీకరించిన సుప్రీం:

అత్యవసర విచారణ జరపాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం అర్థరాత్రి తర్వాత 1.45గం.కి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. జస్టిస్ ఏకె సిక్రీ, ఎస్ఏ బోబ్డే, అశోక్ భూషణ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది.

Newest First Oldest First
4:48 AM, 17 May
సుప్రీంలో వాదనల సందర్భంగా రోహ్ తగికి, సింఘ్వీకి మధ్య మాటల యుద్దం నడిచింది. ఒకానొక సందర్బంలో.. నువ్వెవరు ఇక్కడ వాదించడానికి అని సింఘ్వీ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. నువ్వు యడ్యూరప్ప కోసం వాదించట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేల కోసం వాదిస్తున్నావు అంటూ సింఘ్వీ ఆరోపించారు.
4:43 AM, 17 May
కాంగ్రెస్, జేడీఎస్ ల పిటిషన్ పై కోర్టు తీర్పుకు సంబంధించిన ఉత్తర్వులు ఉదయం 6గం. లేదా ఆ తర్వాత వెలువడవచ్చునని తెలుస్తోంది.
4:38 AM, 17 May
కాంగ్రెస్, జేడీఎస్ ల పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. 'ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతాం' అని పేర్కొంది. అంతేకాదు, బీజేపీ బీఎస్ యడ్యూరప్పను దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరింది.
4:34 AM, 17 May
కాంగ్రెస్, జేడీఎస్ తరుపు న్యాయవాది సింఘ్వీ ఇంకా కోర్టులో తన వాదనలు వినిపిస్తున్నారు. ప్రమాణస్వీకారాన్ని కొన్ని గంటల పాటైనా వాయిదా వేయాలని కోరుతున్నారు. సాయంత్రం 4.30గం.కి ప్రపమాణస్వీకారానికి అనుమతివ్వాలని, ఆలోపు యడ్యూరప్ప తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించాలని ఆయన వాదిస్తున్నారు.
4:25 AM, 17 May
యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై 'స్టే' ఇవ్వాలన్న కాంగ్రెస్, జేడీఎస్ ల పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో కర్ణాటక పగ్గాలు చేపట్టేందుకు యడ్యూరప్పకు లైన్ క్లియర్ అయింది.
4:14 AM, 17 May
ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడమనేది గవర్నర్ కి సంబంధించిన వ్యవహారం. ఏ కోర్టుకి రాష్ట్రపతి, గవర్నర్ జవాబుదారీగా ఉండరు. రాజ్యాంగబద్ద వ్యవహరిస్తున్న గవర్నర్ అధికారాలను కోర్టు అడ్డుకోవద్దు అని ముకుల్ రోహ్ తగి పేర్కొన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఈ పిటిషన్ ను కొట్టివేయాలని కూడా ఆయన వాదించారు.
4:07 AM, 17 May
ప్రమాణస్వీకారమైతే జరగనివ్వండి. అసెంబ్లీలో మా బలాన్ని నిరూపించుకుంటామని యడ్యూరప్ప తరుపున వాదిస్తున్న మాజీ ఏజీ రోహ్ తగి వాదించారు.
4:00 AM, 17 May
బలనిరూపణ కోసం ఇచ్చిన గడువును 15 నుంచి 10 లేదా 7 రోజులకు కుదించాలన్న ప్రతిపాదనను మాజీ ఏజీ రోహ్ తగి, అటార్నీ జనరల్ వేణుగోపాల్ అంగీకరించారు. అయితే దీనిపై రేపు నిర్ణయం తీసుకోవచ్చునని, ఈ సమయంలో విచారణ అవసరం లేదని రోహ్ తగి న్యాయమూర్తులతో పేర్కొన్నారు.
3:55 AM, 17 May
గవర్నర్ బీఎస్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ జారీ చేసిన ఉత్వర్వుల కాపీని సింఘ్వీ న్యాయమూర్తికి అందజేశారు. కాపీని పరిశీలించిన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే.. దానిపై ఫోటో సరిగా లేకపోవడాన్ని గమనించి.. 'ఈ రాత్రి లాగే ఇది కూడా నల్లగా ఉంది' అని కామెంట్ చేశారు.
3:50 AM, 17 May
ఓవైపు తమకు 117మంది ఎమ్మెల్యేల మద్దత ఉందని కాంగ్రెస్, జేడీఎస్ చెబుతుంటే.. మీకు 112మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడినుంచి వస్తుంది? అని న్యాయమూర్తి ఏకె సిక్రీ కేంద్రం తరుపున వాదిస్తున్న ఏజీ కెకె వేణుగోపాల్ ను ప్రశ్నించారు.
3:43 AM, 17 May
అర్థరాత్రి విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించదు. చివరిసారిగా అర్థరాత్రి విచారించిన కేసు 'యాకూబ్ యెమెన్'ది, ఇప్పుడీ కేసు అంత అర్జెంటా? అని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
3:42 AM, 17 May
అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తన వాదనను వినిపిస్తున్నారు.
3:41 AM, 17 May
'గవర్నర్ కు సమర్పించిన లేఖలో.. యడ్యూరప్ప తనకెంత మెజారిటీ ఉందని చెప్పారో తెలియదు. ఆ లేఖను చూడకుండానే ఊహాగానాలు చేయడం తగదు' అని న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే సింఘ్వీకి తెలిపారు.
3:37 AM, 17 May
అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, మాజీ అటార్నీ జనరల్ రోహ్ తగి, అడిషనల్ సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలను కోర్టు ఇంకా వినాల్సి ఉంది.
3:35 AM, 17 May
గవర్నర్ అధికారాల కంటే సుప్రీంకే ఎక్కువ అధికారాలు ఉంటాయని సింఘ్వీ తన వాదనల్లో ప్రస్తావించారు. ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయడం గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకున్నట్టు కాదని కోర్టుకు తెలిపారు. ప్రమాణస్వీకారాన్ని ఎల్లుండి అయినా పెట్టుకోవచ్చునని అన్నారు.
3:31 AM, 17 May
రెండు గంటలు పైగా కొనసాగుతున్న విచారణలో సింఘ్వీ గంట పాటు తన వాదనలు వినిపించారు. దీంతో ఇక సింఘ్వీ తన వాదనను నిలిపివేయాల్సిందిగా సుప్రీం ధర్మాసనం ఆయన్ను కోరింది.
3:26 AM, 17 May
ప్రమాణస్వీకారంపై స్టే ఇవ్వడం గవర్నర్ అధికారాలను అడ్డుకోవడం ఎలా అవుతుంది? అని సింఘ్వీ న్యాయమూర్తిని ప్రశ్నించారు.
3:21 AM, 17 May
'బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ విడుదల చేసిన లేఖ కూడా మీ వద్ద లేదు. అలాంటప్పుడు గవర్నర్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఎలా కోరుతారు' అని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సింఘ్వీని ప్రశ్నించింది.
3:15 AM, 17 May
గవర్నర్ అధికారాలను సవాల్ చేయడం కుదరదని యడ్యూరప్ప తరుపున వాదిస్తున్న మాజీ అటార్నీ జనరల్ ముుకల్ రోహ్ తగి వాదించారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ విచక్షణా అధికారాలను కోర్టులో సవాల్ చేయవచ్చునని సింఘ్వీ ప్రతివాదన వినిపించారు.
2:57 AM, 17 May
ఆర్టికల్-361ప్రకారం గవర్నర్ అధికారాలను నియంత్రించమంటారా? అని న్యాయమూర్తి బోబ్డే సింఘ్వీని ప్రశ్నించారు.
2:49 AM, 17 May
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్టే ఇవ్వాలని సింఘ్వీ న్యాయమూర్తిని కోరారు. దీంతో గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకోవాలా? అని న్యాయమూర్తి బోబ్డే సింఘ్వీని ప్రశ్నించారు. గతంలో సుప్రీం అలా జోక్యం చేసుకుందని సింఘ్వీ తెలిపారు.
2:45 AM, 17 May
' మెజారిటీ ఎమ్మెల్యేల జాబితాను యడ్యూరప్ప గవర్నర్ కు సమర్పించలేదని మీకెలా తెలుసు?' అని న్యాయమూర్తి బోబ్డే సింఘ్వీని ప్రశ్నించారు.
2:42 AM, 17 May
మెజారిటీ సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రాజ్యాంగబద్దం కాదా? అని సుప్రీంకోర్టు సింఘ్వీని ప్రశ్నించింది.
2:38 AM, 17 May
బలనిరూపణ కోసం ఒక పార్టీకి 15రోజుల సమయం ఇవ్వడం గతంలో ఎన్నడూ వినలేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. 116మంది ఎమ్మెల్యేలతో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నవాళ్లను పక్కనపెట్టి.. 104మంది ఎమ్మెల్యేలతో కూడిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమే కాక బలనిరూపణకు అంత గడువు ఇవ్వడం మరింత దారుణమన్నారు.
2:33 AM, 17 May
గతంలో గోవా ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల్ని అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు వివరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. బీజేపీ మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు
2:24 AM, 17 May
కాంగ్రెస్, జేడీఎస్ లకు 116మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితా కూడా తమ వద్ద ఉందని సింఘ్వీ న్యాయమూర్తికి తెలిపారు. కానీ బీజేపీ మాత్రం కేవలం 104సీట్లతోనే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దపడుతోందని, కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని కోర్టుకు వివరించారు.
2:21 AM, 17 May
యడ్యూరప్పను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని సుప్రీం రాజ్యాంగ విరుద్దంగా పరిగణించే అవకాశం ఉంది. మేజిక్ ఫిగర్ సీట్లను కలిగి ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను సుప్రీం ఆదేశించే అవకాశం ఉంది.
2:17 AM, 17 May
సుప్రీంకోర్టులో కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్ పై వాదనలు మొదలయ్యాయి. కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని కాంగ్రెస్, జేడీఎస్ తరుపు న్యాయవాది సింఘ్వీ న్యాయమూర్తితో పేర్కొన్నారు.
2:11 AM, 17 May
కాంగ్రెస్, జేడీఎస్ తరుపున అభిషేక్ మను సింఘ్వీ, కేంద్ర ప్రభుత్వం తరుపున తుషార్ మెహతా(అడిషనల్ సొలిసిటరీ జనరల్), బీజేపీ యడ్యూరప్ప తరుపున మాజీ అటార్నీ జనరల్ రోహ్ తగి సుప్రీం కోర్టులో వాదించనున్నారు.
2:03 AM, 17 May
మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్ తగి బీజేపీ, బీఎస్ యడ్యూరప్ప తరుపున వాదించనున్నారు.
READ MORE

ఇదే అంశంపై కాంగ్రెస్, జేడీఎస్ ల తరుపు న్యాయవాది జావెద్ మాట్లాడుతూ.. 'బీజేపీ గెలిచింది 104స్థానాలు. అసెంబ్లీలో బలనిరూపణ ఎలా సాధ్యం?. స్వతంత్ర ఎమ్మెల్యేలను కలుపుకున్నా అది సాధ్యపడదు. కాబట్టి నయానో.. భయానో.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.' అని పేర్కొన్నారు.

కాగా, కాంగ్రెస్, జేడీఎస్ లు అత్యవసర విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. సుప్రీం రిజిస్ట్రాటర్ సీజేఐ (ప్రధాన న్యాయమూర్తి) దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లారు. ఈ విషయంపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది.

మరోవైపు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇదే అంశంపై మాట్లాడుతూ.. బలనిరూపణలో తాము కచ్చితంగా నెగ్గి తీరుతామన్నారు. బుధవారం రాత్రి బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ఇంట్లో ఆయన మంతనాలు జరిపారు.

English summary
Abhishek Manu Singhvi who is the counsel for JD(S) & #Congress, seeks emergency hearing on the pleas submitted by the 2 parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X