బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ దెబ్బ: ఒక్క ఎమ్మెల్యేని బయటకు వదలద్దు: కాంగ్రెస్ హైకమాండ్, మొత్తం రివర్స్ !

గుజరాత్ కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలి బయటకురాకూడదని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గుజరాత్ కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలి బయటకురాకూడదని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. రిసార్ట్ వదిలి బయటకు వస్తే బీజేపీ నాయకులు గాలం వేస్తారని కాంగ్రెస్ హై కమాండ్ హడలిపోయింది.

శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప ఇంటర్వూలు ఆపండి: కర్ఱాటక సీఎంకు లేఖ, ఇదో కొత్త వార్నింగ్ !శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప ఇంటర్వూలు ఆపండి: కర్ఱాటక సీఎంకు లేఖ, ఇదో కొత్త వార్నింగ్ !

రాజ్యసభ ఎన్నికల సందర్బంగా ఆపరేషన్ కమల (బీజేపీ)తో భయం పట్టుకున్న కాంగ్రెస్ నాయకులు గుజరాత్ లోని సొంత పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ఈగల్ టన్ రిసార్ట్ కు తరలించారు.

 Congress keeps Gujarat MLAs at Karnataka resort

ఈగల్ టన్ రిసార్ట్ లో బోరుకొడుతోందని ఎమ్మెల్యేలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. వారికి కర్ణాటకలోని మడికేరిలో సుందరమైన ప్రాంతాలు చూపించాలని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. అంతే కాకుండా బెంగళూరులోని ప్రముఖ ప్రాంతాలు చూపించాలని నిర్ణయించారు.

గుజరాత్ లో వరదలు, బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విందు, చిందులు: మీకు సిగ్గుందా !గుజరాత్ లో వరదలు, బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విందు, చిందులు: మీకు సిగ్గుందా !

సాఫ్ట్ వేర్ కంపెనీలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పర్యాటక ప్రాంతాలు చూపించడానికి ప్లాన్ చేశారు. అయితే మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. ఒక్క ఎమ్మెల్యేని కూడా రిసార్ట్ నుంచి బయటకు పంపించడానికి కుదరదని కర్ణాటక ప్రభుత్వ పెద్దలకు ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం.

అంతే ముందుగా నిర్ణయించిన మొత్తం ప్లాన్ తల్లకిందలు కావడంతో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్ కే పరిమితం అయ్యారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

English summary
After its six MLAs deserted ahead of Rajya Sabha polls, a wary Congress has lodged its 44 Gujarat legislators at a private resort on the outskirts of Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X