వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభను వృద్ధాశ్రమం చేయవద్దు, కురియన్ ఇక తప్పుకోవాలి: కేరళ కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: రాజ్యసభను వృద్ధాశ్రమంగా మార్చవద్దని, యువకులకు అవకాశాలు ఇవ్వాలని కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఇకనైనా రాజకీయాల నుంచి సెలవు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కాగా, జూన్ నెలలో కేరళలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కురియన్ రీ-నామినేషన్ అంశం చర్చనీయాంశమైంది. 'ఇప్పటికే 3 సార్లు రాజ్యసభకు ఎన్నికైన కురియన్ ఈసారైన తెలివైన నిర్ణయం తీసుకుని పార్లమెంటరీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని భావిస్తున్నాం' అని కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటి బలరాం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిప్రాయపడ్డారు.

Congress Kerala MLAs don’t want PJ Kurien back in Rajya Sabha

బలరాం వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే పార్టీలోని మరికొందరు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాజ్యసభను ఒక వృద్ధాశ్రమంగా మార్చాలని పార్టీ అనుకోవడం లేదని వారు గుర్తుచేస్తున్నారు. యువకులకు కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

కేరళ కాంగ్రెస్ చీఫ్ ని మారుస్తారా?కేరళ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయంపై కురియన్ కూడా సానుకూలంగానే స్పందించారు. పార్టీ వెళ్లిపోమంటే అందుకు తాను సిద్దమని చెప్పారు.

చెంగనూర్ ఉపఎన్నికలో ఓటమితో పార్టీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఓటమికి నేపథ్యంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంఎం హసన్ ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తిరిగి రాగానే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
Smarting from the recent Chengannur bypoll humiliation, the young brigade of the Kerala Congress has taken on the seniors and doesn’t want Rajya Sabha deputy chairman PJ Kurien to be re-nominated to the House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X