వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం -నెలన్నరగా కరోనాతో పోరాటం - దెబ్బతిన్న ఊపిరితిత్తులు

|
Google Oneindia TeluguNews

లెజెండరీ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రి ఛటర్జీ కరోనాతో కన్నుమూశారన్న విషాదం నుంచి తేరుకోకముందే.. అదే కొవిడ్ వ్యాధికి గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ (71) ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త అందరిలో కలవరం పుట్టిస్తున్నది. నెలన్నర రోజులుగా మహమ్మారితో పోరాడుతోన్న పటేల్ ఆరోగ్యం ఆదివారం నాటికి బాగా క్షీణించింది.

దెబ్బతిన్న అవయవాలు..

దెబ్బతిన్న అవయవాలు..

అక్టోబర్ 1న అహ్మద్ పటేల్ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గుర్ గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. అయితే కరోనాకుతోడు వరుస ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ రావడంతో చికిత్స కష్టమైపోయింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు.. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఇతర కీలక అవయవాలపై కూడా ఆ ప్రభావం పడిందని వైద్యులు చెబుతున్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు -పవన్ కల్యాణ్ వ్యూహరచన -17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలుఒకే దెబ్బకు రెండు పిట్టలు -పవన్ కల్యాణ్ వ్యూహరచన -17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలు

ప్రార్థనలు చేయాలంటూ..

ప్రార్థనలు చేయాలంటూ..

అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఓ ట్వీట్‌ చేస్తూ, విషమం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, తన మిత్రుడు, కామ్రేడ్ అహ్మద్ పటేల్ త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా అహ్మద్ పటేల్ కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా శర్మ కోరారు. ‘‘నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఆయన త్వరగా కోలుకునేలా అందరూ ప్రార్ధించాలని కోరుతున్నా'' అని అహ్మద్ పటేల్ కొడుకు ఫైసల్ పటేల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్‌ చేసి..కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్‌ చేసి..

సోనియాకు నమ్మకస్తుడు..

సోనియాకు నమ్మకస్తుడు..

గుజరాత్ కు చెందిన 71 ఏళ్ల అహ్మద్ పటేల్‌.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా, సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుగా, అత్యంత నమ్మకస్థుడైన నేతగా కొనసాగుతున్నారు. కరోనాతో ఆస్పత్రికి పరిమితమైపోవడంతో ఇటీవలి గుజరాత్ ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల్లో ఆయన భాగం పంచుకోలేకపోయారు.

English summary
Senior Congress leader and party treasurer Ahmed Patel is in a critical condition following a series of complications after he tested positive for COVID-19 on October 1. He is currently admitted at the Intensive Care Unit of the Medanta Hospital in Gurgaon. The infection, sources said, had caused damage to his lung and affected other critical organs too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X