వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు నుంచి అధినేత్రి వద్దకు, సోనియాగాంధీతో చిదంబరం భేటీ, 20 నిమిషాల పాటు చర్చలు..

|
Google Oneindia TeluguNews

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్ని తీహర్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం జైలు నుంచి విడుదలయ్యారు. కుమారుడు కార్తీ సహా ఆశేష కాంగ్రెస్ కార్యకర్తలు వెంట రాగా చిదంబరం జైలు నుంచి బయటకొచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ ఆగస్ట్ 21వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సోనియా ఇంటికి

సోనియా ఇంటికి

జైలు నుంచి విడుదలైన చిదంబరం.. నేరుగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసానికి చేరుకున్నారు. సోనియాగాంధీతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై 20 నిమిషాల పాటు చర్చించారు. తర్వాత అక్కడినుంచి బయల్దేరారు.

 2 లక్షల పూచికత్తు..

2 లక్షల పూచికత్తు..

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు లాయర్ వాదనలు వినిపించగా.. అతను ఇప్పుడు అధికారంలో లేడు కదా అని బెయిల్ మంజూరు చేసింది. రూ.రెండు లక్షల పూచికత్తు, ఇద్దరు సాక్షుల సంతకాలతో విడుదల చేసింది. కొన్ని ఆంక్షలు కూడా విధించింది. మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వొద్దని ఇతర కండీషన్లు పెట్టింది. దేశంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభంపై చిదంబరం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసు, ఇతర అంశాలపై చర్చిస్తారా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు కండీషన్స్ పెట్టింది.

105 రోజులకు..

105 రోజులకు..

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను ఆగస్ట్ 21వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ కస్టడీ పేరుతో తీహర్ జైలులో చిదంబరం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మినరల్ వాటర్, ఇంటి ఆహారాన్ని కూడా అందజేశారు. జైలులో దోమలు కుట్టకుండా తెరలను కూడా ఏర్పాటు చేశారు.

కడుపునొప్పి అని..

కడుపునొప్పి అని..

చిదంబరానికి కడుపునొప్పి ఉందని అతని వైద్యులు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ హైదరాబాద్ ఏషియన్ ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటామని కోరారు. కానీ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు బలంగా ఉండటంతో కోర్టు చిదంబరం తరఫు న్యాయవాది వాదనలను తోసిపుచ్చారు.

English summary
Chidambaram paid a visit to Congress acting president sonia gandhi house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X