వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌కు వ్యతిరేకంగా నామినేషన్? అధిష్ఠానమే అడ్డుకుందా? బీజేపీ చేతికి కొత్త ఆయుధం!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆ పార్టీకే చెందిన ఓ ముస్లిం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రాహుల్‌ గాంధీయే కాక మరో వ్యక్తి కూడా నామినేషన్ వేయడానికి ప్రయత్నించారట.

అయితే నామినేషన్ వేయనీయకుండా తనను అడ్డుకున్నారంటూ ఉత్తరప్రదేశ్‌కి చెందిన అయుబ్ అలీ అనే ముస్లిం నేత గురువారం చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పార్టీ అత్యున్నత పదవి కోసం తాను వేసిన నామినేషన్‌ను కాంగ్రెస్ అధిష్టానం తిస్కరించిందని ఆయన పేర్కొన్నారు.

Congress leader claims he had filed nomination against Rahul Gandhi, but was rejected

తన నామినేషన్ ఎందుకు తిరస్కరించారో కూడా సమాధానం చెప్పలేదన్నారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీకి అనుకూలంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ తొలుత మహారాష్ట్రకు చెందిన షాహ్‌జాద్ పూనావాలా ఆరోపించిన సంగతి తెలిసిందే.

దేశంలోని మిగతా పార్టీల మాదిరిగానే కాంగ్రెస్‌కి కూడా 'యాజమాన్యం' ఉందని పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ తనతో చెప్పినట్టు పూనావాలా ఆరోపించారు. తాజాగా ఆయుబ్ కూడా పార్టీ అధిఫష్ఠానానికి భిన్నంగా మాట్లాడుతుండడంతో ప్రత్యర్థి పార్టీ బీజేపీకి మరో ఆయుధం దొరికినట్టేనని భావిస్తున్నారు.

English summary
An Uttar Pradesh Congress Muslim leader on Thursday claimed that he was barred from filing nomination to challenge Rahul Gandhi for the party top post. Rahul Gandhi can't run Congress on his own: Times Now survey finds. The Congress officials rejected my application for the election to party president post. No valid reason was cited for rejection, said Ayub Ali. Notably, Shehzad Poonawalla was the first Congress leader who had alleged that the party president's election was rigged to favour Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X