వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీకే. శివకుమార్ ఈడీ కస్టడీ అంతం, నేడు బెయిల్ వస్తుందా ? తీహార్ జైలుకు ?!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ (అక్రమ నగదు లావాదేవీలు)కు పాల్పడ్డారని అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కస్టడీ నేటితో ముగిసిపోతుంది. శుక్రవారం మద్యాహ్నం ఈడీ అధికారులు డీకే. శివకుమార్ ను న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. గురువారం రాత్రి మొత్తం డీకే. శివకుమార్ ఆసుపత్రిలోనే ఉన్నారు. డీకే శివకుమార్ కు బెయిల్ రాకుంటే తీహార్ జైలుకు పంపించే అవకాశం ఉందని సమాచారం.

ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!

వెంటాడుతున్న ఈడీ

వెంటాడుతున్న ఈడీ

డీకే శివకుమార్ ను శుక్రవారం మద్యాహ్నం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్న ఈడీ అధికారులు మరో నాలుగు రోజులు ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని, విచారణ చెయ్యాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తికి మనవి చేసే అవకాశం ఉంది. ఇటీవల డీకే. శివకుమార్ ను 14 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో మనవి చెయ్యడంతో న్యాయమూర్తి 10 రోజులు మాత్రమే ఆయన్ను విచారణ చెయ్యడానికి ఈడీ కస్టడీకి ఇచ్చారు.

రంగంలోకి అభిషేక్ మను సింఘ్వీ

రంగంలోకి అభిషేక్ మను సింఘ్వీ

డీకే. శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రంగంలోకి దిగుతున్నారు. డీకే శివకుమార్ కు బెయిల్ ఇవ్వాలని శుక్రవారం అభిషేక్ మను సింఘ్వీ ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో అర్జీ సమర్పించనున్నారు. ఇప్పటికే 10 రోజులు ఈడీ అధికారులు డీకే. శివకుమార్ ను విచారణ చేశారని, ఈడీ అధికారుల ప్రశ్నలకు డీకే శివకుమార్ అన్ని సమాధానాలు చెప్పారని, ఇక విచారణ చెయ్యాల్సిన అవసరం లేదని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. అయితే డీకే. శివకుమార్ కు బెయిల్ వస్తుందా ? లేదా ? అనే విషయం వేచి చూడాలి.

తీహార్ జైలుకు డీకే ?

తీహార్ జైలుకు డీకే ?

10 రోజులు విచారణ ఎదుర్కొన్న డీకే. శివకుమార్ ను న్యాయస్థానం రిమాండ్ కు తరలించే అవకాశం లేకపోలేదు. కనీసం 14 రోజులు డీకే. శివకుమార్ ను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఆ సమయంలో డీకే. శివకుమార్ బెయిల్ తీసుకోవడానికి న్యాయస్థానంలో అర్జీ సమర్పించడానికి అవకాశం ఉంది డీకే. శివకుమార్ ను న్యాయస్థానం రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేస్తే ఢిల్లీలోని తీహార్ జైలుకు ఆయన్ను తరలించే అవకాశం ఉంది.

ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టు

శుక్రవారం ఈడీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇవ్వలేదంటే ఢిల్లీ హైకోర్టును డీకే. శివకుమార్ ఆశ్రయించాలని నిర్ణయించారు. ఢిల్లీలోని ఈడీ అధికారుల అదుపులో ఉన్న డీకే. శివకుమార్ ఢిల్లీ హైకోర్టులోనే బెయిల్ కోసం అర్జీ సమర్పించాలి. మొత్తం మీద డీకే. శివకుమార్ కు బెయిల్ ఇప్పించాలని ఆయన తరపు న్యాయవాదులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

శుక్రవారం డీకే. శివకుమార్ ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో డీకే. శివకుమార్ కు బెయిల్ వస్తుందా ? లేదా ? అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. డీకే. శివకుమార్ సొంత నియోజక వర్గం కనకపుర, రామనగర జిల్లాలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లో బీపీ, కడుపు నొప్పి కారణంతో గురువారం రాత్రి పూర్తిగా ఆసుపత్రిలో ఉన్న డీకే. శివకుమార్ ను శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

English summary
Karnataka former Minister and Congress leader D.K.Shivakumar Enforcement Directorate custody will end today. ED officials will produce him to court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X