బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో నయా పాలిటిక్స్: బెంగళూరులో హైడ్రామా: నడిరోడ్డుపై బైఠాయించిన డిగ్గీ రాజా..ముందస్తు అరెస్ట్.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాలకు కర్ణాటక కేంద్రబిందువైంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బెంగళూరు కేంద్రంగా పావులను కదుపుతోంది. బెంగళూరు ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది అసంతృప్త శాసనసభ్యులు అక్కడే మకాం వేశారు గనక. ఆ 21 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలను చేపట్టింది హస్తం పార్టీ. ఈ బాధ్యతలను సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌పై పెట్టింది. రావడం రావడంతోనే డిగ్గీ రాజా హల్‌చల్ మొదలు పెట్టారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఉద్రిక్త పరిస్థితులు..
దిగ్విజయ్ సింగ్‌ను నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆయన వినిపించుకోలేదు. పార్టీ ఎమ్మెల్యేలను కలుసుకునే వీలు కల్పించేంత వరకూ తాను కదలబోనని హెచ్చరించారు. దీనితో ఆయనను బలవంతంగా పక్కకు తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించడంతో కలకలం చెలరేగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Congress leader Digvijaya Singh placed under preventive arrest in Bengaluru

26 వరకూ గడువు
నిజానికి- మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం నాడే బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ.. అది కాస్తా ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బలపరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర స్పీకర్ ప్రజాపతి వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల ప్రస్తుతం కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీల పడింది. బెంగళూరులో మకాం వేసిన 21 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభకు హాజరైతే.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది. వారిని నచ్చజెప్పడానికి దిగ్విజయ్ సింగ్ బెంగళూరుకు చేరుకున్నారు.

Recommended Video

CoronaVirus Latest Updates | Helpline Number | Symptoms & Precautions

English summary
Karnataka: Congress leader Digvijaya Singh has now been placed under preventive arrest. He was sitting on dharna near Ramada hotel in Bengaluru, allegedly after he was not allowed by Police to visit it. 21 Madhya Pradesh Congress MLAs are lodged at the hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X